Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యూస్: పోలింగ్ కేంద్రం వద్ద కాల్పులు: ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

లాస్‌ఏంజెల్స్: అమెరికాలో జరుగుతున్న అధ్యక్ష ఎన్నికల్లో కాల్పుల ఘటన కలకలం రేపింది. లాస్ఏంజెల్స్‌లోని అజుసా పోలింగ్ కేంద్రం వద్ద దుండగుడు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఎన్నికలు: 68-48తో ట్రంప్ కంటే హిల్లరీ ముందంజ

క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు భారీగా మోహరించారు. తాత్కాలికంగా పోలింగ్ నిలిపివేశారు. సమీపంలోని పోలింగ్ కేంద్రాలను కూడా మూసివేసి.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.

1 dead, multiple people shot near Azusa

కాగా, ఈ కాల్పులకు పాల్పడింది ఓ మహిళగా గుర్తించారు పోలీసులు. భారీగా ఆయుధాలతో వచ్చిన ఆమె.. కాల్పులకు తెగబడినట్లు తెలిపారు. అయితే, మరికొందరు కాల్పులు జరిపింది పురుషుడేనని పేర్కొంటున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఈ ఘటన మంగళవారం సాయంత్రం 5.30గంటలకు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

పోలీసులపై కూడా 20రౌండ్ల కాల్పులు జరిపినట్లు అజుసా పోలీస్ చీఫ్ స్టీవ్ హంట్ తెలిపారు. కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు ఓ ఇంట్లో దూరాడని చెప్పారు. నిందితుడి కోసం వేట కొనసాగుతోందని తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+