Masood Azhar: భారత్ దాడిలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ కుటుంబంలో 10 మంది బలి..!
కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి కౌంటర్ గా భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్ ఆపరేషన్ సిందూర్ లో అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. భారత్ లో గతంలో పలు ఉగ్రదాడులకు కారణమైన ఉగ్రవాదుల శిబిరాల్ని కుప్పకూల్చడంతో పాటు ఆయా తీవ్రవాదుల కుటుంబ సభ్యుల్ని కూడా హతమార్చింది. ఇందులో గతంలో కాందహార్ విమాన హైజాక్ సమయంలో భారత్ అప్పగించిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, పార్లమెంట్ పై సహా ఇతర దాడుల్లో ప్రమేయం ఉన్న మసూద్ అజహర్ కుటుంబం కూడా ఉంది.
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో పాకిస్తాన్ లో ఉంటూ మన దేశంలో ఎన్నో దాడులకు ప్లాన్లు వేసిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజహర్ కుటుంబంలో 10 మంది చనిపోయారు. అతని మరో నలుగురు అనుచరులు కూడా చనిపోయారు. ఈ విషయాన్ని స్వయంగా మసూద్ నిర్ధారించాడు. పాకిస్తాన్ లోని బహావ్ పూర్ లోని సుభానల్లా మసీద్ పై భారత్ జరిపిన దాడిలో వీరంతా చనిపోయారు.

జైషే మొహమ్మద్ తీవ్రవాద సంస్ధను నడుపుతున్న మసూద్ అజహర్ స్వయంగా చేసిన ప్రకటనలో భారత్ జరిపిన దాడిలో తన పెద్దక్క, ఆమె భర్త, మన మేనల్లుడు, అతని భార్య, మేనకోడలు, ఐదుగురు పిల్లలు చనిపోయినట్లు వెల్లడించాడు. 2019లో కశ్మీర్ లోని పుల్వామాలో ఈయన నడుపుతున్న తీవ్రవాద సంస్ధ జరిపిన దాడిలో 40 మంది సైనికులు చనిపోయారు. అప్పటి నుంచీ భారత్ మసూద్ పై దాడులకు ప్లాన్ చేస్తూనే ఉంది. కానీ ఈసారి దాడిలోనూ అతను బతికిపోగా కుటుంబ సభ్యులు, అనుచరులు కలిపి 14 మంది చనిపోయారు.
పహల్గాం దాడుల తర్వాత భారత్ ప్రతీకార దాడులు చేస్తుందని ఊహించిన మసూద్ అజహర్ పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి మూడంచెల భద్రత తీసుకున్నాడు. అందుకే భారత్ జరిపిన దాడులకు దొరక్కుండా తప్పించుకున్నట్లు తెలుస్తోంది. అయితే భారత్ పై గతంలో ఎన్నో దాడులకు పాల్పడ్డ మసూద్ అజహర్ ను ఇప్పటికే ఐక్యరాజ్యసమితి సైతం మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ప్రకటించింది. అయినా పాకిస్తాన్ మాత్రం తమ దేశంలో స్వేచ్ఛగా తిరగనిస్తోంది.












Click it and Unblock the Notifications