తొక్కిసలాటతో బంగ్లాదేశ్‌లో 10మంది హిందూభక్తుల మృతి

బంగ్లాదేశ్: దేవాలయంలో పూజలు చెయ్యడానికి వెళ్తున్న సమయంలో జరిగిన తొక్కిసలాటలో 10 మంది మృతి చెందగా, 30 మందికి పైగా తీవ్ర గాయలైన సంఘటన బంగ్లాదేశ్‌లో జరిగింది. ఈ ఘటనలో గాయపడ్డ బాధితులను ఆసుపత్రికి తరలించారు.

బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలోని బ్రహ్మపుత్ర నదీ తీరంలో హిందువులకు పవిత్రమైన లంగల్ బంద్ దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో చైత్ర అష్టమి సందర్బంగా ప్రతి సంవత్సరం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బంగ్లాదేశ్‌లోని హిందువులతో పాటు పోరుగు దేశాలైన భారతీయులు, నేపాలీలు ఈ దేవాలయంలో పూజలు చేస్తుంటారు.

 10 Hindu devotees killed in Langalbandh stampede

శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో వేలాది హిందూ భక్తులు బ్రహ్మపుత్ర నదిలో స్నానం చేశారు. అనంతరం అందరూ కలిసి లంగల్ బంద్ దేవాలయం దగ్గరకు బయలుదేరారు. ఒక్కసారిగా భక్తులు దేవాయలంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.

దీంతో తొక్కిసలాట జరిగింది. కిందపడిన వారి మీద నుండి పలువురు భక్తులు పరుగులు పెట్టారు. ఈ తొక్కిసలాటలో 10 మంది మరణించారు. మృతి చెందిన వారు 50 సంవత్సరాల పైబడిన వారేనని స్థానిక పోలీసు అధికారి ముజురుల్ ఇస్లాం అన్నారు. మృతి చెందిన వారిలో ఏడుగురు మహిళలు ఉన్నారు. బాధితులను ప్రత్యేక ఆంబులెన్స్‌లలో ఢాకాలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి ప్రాంగణం కుటుంబ సభ్యుల రోదనలతో మిన్నంటింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+