న్యూయార్క్ వీధుల్లో వేధింపు: షార్ట్‌ఫిలింకి కోట్లలో వ్యూస్

న్యూయార్క్: వీధుల్లో మహిళల పైన వేధింపుల గురించి న్యూయార్క్ వీధుల్లో ఓ వీడియో తీసిన విషయం తెలిసిందే. ఇది యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయి సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఆ వీడియోకు యూట్యూబ్‌లో ఏకంగా 3,41,87,471 వ్యూస్ వచ్చాయి.

అమెరికాలోని న్యూయార్క్ వీధుల్లో మహిళ ఒంటరిగా నడుస్తుండగా రహస్య కెమెరాలతో దీనిని చిత్రీకరించారు. ఆ సమయంలో ఆమెను పలువురు కామెంట్ చేసిన విషయం తెలిసిందే. వెంటపడి వేధింపులకు గురి చేశారు.

10 hours of street harassment in New York

ఇదిలా ఉండగా, న్యూయార్క్ నగరంలోని వీధుల్లో మహిళల పైన జరుగుతున్న వేధింపులను తెలిపేందుకు కొద్ది రోజుల ఓ షార్ట్ ఫిలిం తీసిన విషయం తెలిసిందే. ఈ చిత్రీకరణలో పాల్గొన్న యువతికి అత్యాచార బెదిరింపులు కూడా వచ్చాయి. హోలాబ్యాక్ అనే సంస్థ నగరంలో స్త్రీల పైన జరిగే వేధింపులను లైవ్‌గా పిక్చరైజ్ చేసింది.

10 అవర్స్ వాకింగ్ ఇన్ ఎన్‌వైసీ యాజ్ ఏ ఉమన్ పేరిట ఆ షార్ట్ ఫిలిం వీడియోను యూట్యూబ్‌లో పెట్టారు. పది రోజుల క్రితం ఈ వీడియో అప్ లోడ్ అయింది. ఇది పెట్టిన రెండు రోజుల్లోనే పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/b1XGPvbWn0A?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

ఈ వీడియోలో షొషానా బి రాబర్ట్స్ అనే యువతి ప్రధాన పాత్రధారి. షొషానా న్యూయార్క్ వీధుల గుండా నడుస్తుండగా.. ఆమె ముందు ఓ వ్యక్తి బ్యాక్ ప్యాక్ తగిలించుకుని వెళుతుంటాడు. ఆ బ్యాక్ ప్యాక్‌కు ఉన్న కెమెరా ద్వారా ఆమెకు ఎదురైన అనుభవాలను చిత్రీకరించారు. బ్యాక్ ప్యాక్ ధరించిన వ్యక్తి పేరు రాబ్ బ్లిస్. ఈ వీడియో ఐడియా అతడిదే.

తన గర్ల్ ఫ్రెండ్‌కు ఎదురైన వేధింపుల పట్ల స్పందించిన రాబ్ బ్లిస్ ఈ వీడియో ద్వారా సమస్య తీవ్రతను వెల్లడించాలని నిర్ణయించుకున్నాడు. షార్ట్ ఫిలిం విషయానికొస్తే, షొషానా బిగ్ యాపిల్ స్ట్రీట్ గుండా వెళుతుండగా కారు కూతలు వినిపించాయి. నైస్, డామ్, స్వీటీ... ఇలా రకరకాలుగా పలువురు ఆమెను పలకరించే ప్రయత్నాలు చేశారు. నా నెంబర్ ఇస్తే మాట్లాడతావా? అంటూ ఒకరు, నువ్వు అందంగా ఉన్నావని అభినందిస్తున్నామని ఇంకొకరు ఆమె వెంటపడ్డారట.

ఈ వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత అందులో నటించిన షొషానాను రేప్ చేస్తామంటూ సందేశాలు వచ్చాయని హోలాబ్యాక్ ట్విట్టర్లో అప్పుడు పేర్కొంది. బెదిరింపులపై హోలాబ్యాక్ డైరెక్టర్ ఎమిలీ మాట్లాడుతూ... తమ వీడియో బాగానే ప్రభావం చూపిస్తోందన్న విషయాన్ని ఈ బెదిరింపులే స్పష్టం చేస్తున్నాయని, అయినప్పటికీ, ఈ సమస్యపై మరింతగా పోరాడాలని భావిస్తున్నామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+