జైలులో ఖైధీల మద్య గ్యాంగ్ వార్, పది మంది మృతి
బ్రెజిల్ లో జైలులో గ్యాంగ్ వార్ చోటుచేసుకొంది. ప్రత్యర్థుల బ్యారక్ లపై దాడులు చేశారు. ఈ ఘటనలో పదిమంది మరణించారని అధికారులు చెబుతున్నారు. శనివారం నాడు జైలులో రెండు గ్రూపుల మద్య వార్ ప్రారంభమైంది.
రియోడిజెనిరో :జైల్లో ఖైధీల మద్య గ్యాంగ్ వార్ లో పదిమంది చనిపోయారు. ముగ్గరు ఖైదీల తలలను ప్రత్యర్థులు వేరు చేశారు. ఈ ఘటన బ్రెజిల్ లోలోని రియోగ్రాండ్ డొనార్డెన్ లో గల అల్కాకుజ్ జైలులో జరిగింది.
రియోడిజెనిరో జైల్లో ప్రత్యర్థుల మద్య గ్యాంగ్ వార్ చోటుచేసుకొంది.శనివారం మధ్యాహ్నం ఈ అల్లర్లు చోటుచేసుకొన్నాయి. రెండు గ్యాంగ్ ల మధ్య ఆధిపత్యపోరు ఈ దారుణానికి కారణమైంది.
జైల్లోనే ప్రత్యర్ధులపై మరో గ్యాంగ్ విచక్షణరహితంగా దాడులు చేసింది. ప్రత్యర్థుల బ్యారక్ లపై దాడి చేసి హతమార్చారని జైళ్ళ శాఖ కో ఆర్డినేటర్ జెమిల్టన్ సిల్వా తెలిపారు.
ఘటన జరిగిన జైలును పోలీసులు చుట్టుముట్టి అన్ని దారులను మూసివేసినట్టు పోలీసులు తెలిపారు. జైలు లోపల ఆయుధాలతో ఉన్న దుండగులను అదుపులోకి తీసుకొని సౌకర్యాలు ఉండగా, ఇప్పుడు అక్కడ వెయ్యి మందికి పైగా ఖైధీలున్నారు. 2016 నవంబర్ లో కూడ ఈ జైలులో అల్లర్లు చెలరేగాయి.












Click it and Unblock the Notifications