Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఒక్కరోజులో సెలబ్రిటీగా: యూట్యూబ్‌లో సంచలనం

న్యూఢిల్లీ: 10 ఏళ్ల బాలుడు ఒక్క రోజులో సెలబ్రిటీగా మారిపోయాడు. పుచ్చకాయను తొక్కుతో సహా తిన్న ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్‌ స్కిబే ఒక్కసారిగా ఫేమస్‌ అయిపోయాడు. సోషల్ మీడియాలో ఓ సంచలనంగా మారాడు. 'వాటర్‌మెలన్‌ బాయ్‌' అనే వీడియో యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేస్తోంది.

వివరాల్లోకి వెళితే, మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో మెల్‌బోర్న్‌ స్టార్స్‌, మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ మధ్య జరుగుతున్న క్రికెట్‌ మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన మిచెల్‌ స్కిబే అనే బాలుడు పుచ్చకాయను తొక్కతో సహా తినేశాడు. ఈ అరుదైన సన్నివేశం శనివారం చోటు చేసుకుంది.

 10-year-old Australian boy eats a whole watermelon during a cricket match at the MCG

మ్యాచ్ చూస్తూ మిచెల్‌ స్కిబే పుచ్చకాయ మొత్తాన్ని అమాంతం తినేయడాన్ని కామెంటేటర్లు సహా అందరూ ఆశ్చర్యపోయారు. 'క్రికెట్‌కు కొత్త హీరో దొరికాడు. మొత్తం పుచ్చకాయను ఖతం చేశాడు. బాగా ఆడావు' అంటూ ట్విట్టర్‌లో వరుస ట్వీట్లతో ముంచెత్తారు.

2016లో తొలి వైరల్ హిట్‌గా మిచెల్‌ స్కిబే వీడియో నిలిచింది. అంతేకాదు లావిష్ ప్రైజ్ అనే మ్యాగజైన్ ఈ ఏడాది తొలి ఇంటర్‌నెట్‌ హీరో అంటూ రాసింది. కాగా రెండేళ్ల వయసప్పటి నుంచి పుచ్చకాయను ఇలా తింటున్నట్టు మిచెల్‌ తెలిపాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+