భయానకం: 100మీ. ఎత్తుతో ఇసుక తుఫాను ఇలా(వీడియో)
బీజింగ్: చైనాలోని కస్గర్, జింజింయాంగ్, టంగ్జంక్, మిన్‌ఫెంగ్, కౌంటీ నగర ప్రజలు భయంకర ఇసుక తుఫానును ఎదుర్కుంటున్నారు. 100 మీటర్ల ఎత్తులో పైకి లేస్తూ వీస్తోన్న ఇసుక తుపాను ధాటికి అక్కడి ఇళ్లన్నీ ఇసుకతో కప్పేయబడ్డాయి.
ఇసుక తుఫాను సృష్టిస్తోన్న బీభత్సం పట్ల అక్కడి అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. నగరంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇసుక కెరటాల ధాటికి అక్కడ జనజీవనం అస్తవ్యస్థమైంది.
కస్గర్ నగర ప్రజలని బయటకు రావొద్దంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం నుంచి ఈ ఇసుక తుఫానులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ ఇసుక తుఫాను ధాటికి అనేక చెట్లు, రోడ్లపై ఉన్న సైన్ బోర్డులు ధ్వంసమయ్యాయి.












Click it and Unblock the Notifications