ఆయనకు 103 ఏళ్లు, ఆమెకు 91 ఏళ్లు: పెళ్లి

లండన్: ఇద్దరు వయో వృద్దులు వివాహం చేసుకుని గిన్నీస్ బుక్ లో రికార్డు సృష్టించారు. నడవలేని సమయంలో ఆ వృద్దుడు వివాహం చేసుకుని తనకు ఒకరు తోడుగా ఉన్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు, వరుడి పుట్టిన రోజు సందర్బంగా మునిమననుమల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది.

లండన్ లో నివాసం ఉంటున్న జార్జ్ కిర్చీ (103), డోరీన్ లక్కీ (91) అనే ఇద్దరు 1988లో కలుసుకున్నారు. అప్పటి నుండి వీరికి పరిచయం ఉంది. అయితే ఇద్దరు వేరే వారిని వివాహం చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు.

103-year-old man weds 91-year-old woman in London

అయితే జార్జ్ కిర్చీ వైవాహిక జీవితం విఫలం అయ్యింది. డోరీన్ లక్కీ భర్త కొన్ని సంవత్సరాల క్రితం మరణించారు, వీరికి ఏడుగురు సంతానం. 15 మంది మనుమలు, ఏడు మంది ముని మనిమనుమలు ఉన్నారు. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు.

అందుకు ఇద్దరి కుటుంబ సభ్యులు ఓకే అన్నారు. ఇటివల (శనివారం) ఇద్దరి వివాహం కుటుంబ సభ్యులు, గిన్నీస్ బుక్ ప్రతినిధి సమక్షంలో వైభంగా జరిగింది. వీల్ చేర్ లో కుర్చుని ఉన్న వరుడు జార్జ్ కిర్చీని వధువు డోరీన్ లక్కీ తోసుకుంటు వచ్చారు. తరువాత ఉంగరం మార్చుకుని ఇద్దరు వైభవంగా వివాహం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+