coronavirus: కరోనా విలయం, అమెరికాలో భారత సంతతికి చెందిన 11 మంది మృతి, 16 మందికి...
కరోనా వైరస్ అమెరికాలో విలయతాండవం చేస్తోంది. వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య 14 వేలు దాటింది. అయితే అమెరికాలో భారత సంతతికి చెందిన వారు కూడా మృతుల్లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పలువురికి వైరస్ సోకడంతో ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు.
అమెరికాలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 4 లక్షల మార్క్ దాటింది. అగ్రరాజ్యంలో 11 మంది భారత సంతతికి చెందిన వారు చనిపోయారు. మరో 16 మంది వైరస్ సోకి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైరస్ సోకి చనిపోయిన 16 మంది పురుషులేనని అమెరికా అధికారులు పేర్కొన్నారు. న్యూయార్క్‌కి చెందిన వారు 10 మంది ఉండగా, న్యూజెర్సీకి చెందినవారు నలుగురు ఉన్నారు. న్యూయార్క్‌లో ఉన్న వారు ట్యాక్సీ నడుపుకొని జీవించేవారు అని అధికారులు తెలిపారు.

న్యూయార్క్‌లో సిచుయేషన్ క్రిటికల్‌గా ఉంది. వైరస్ సోకి 6 వేల మంది చనిపోగా.. లక్ష 38 వేల మందికి పాజిటివ్ వచ్చింది. న్యూజెర్సీలో 48 వేల మందికి వైరస్ సోకగా.. 1500 మంది చనిపోయారు. ఫ్లోరిడాలో మరొ భారత సంతతికి చెందిన వ్యక్తి చనిపోయారని అధికారులు తెలిపారు. మిగతావారు కాలిఫోర్నియా, టెక్సాస్‌లో నివసిస్తున్నారని తెలిపారు. వైరస్ సోకిన 16 మందిలో నలుగురు మహిళలు ఉన్నారు. వారంత స్వీయ నిర్బంధంలో ఉన్నారని అధికారులు వివరించారు. న్యూయార్క్‌కు చెందిన వారు 8, న్యూజెర్సీ నుంచి ముగ్గురు.. మిగతా వారు టెక్సాస్, కాలిఫొర్నియాకు చెందినవారు అని పేర్కొన్నారు.
అమెరికాలో వైరస్ సోకిన వారి కోసం చికిత్స అందించేందుకు అమెరికా అధికారులతో భారత రాయబార కార్యాలయ అధికారులు నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారని వివరించారు.
Recommended Video
-
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల












Click it and Unblock the Notifications