ఊపిరి ఆడక ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మృతి
ఇస్లామాబాద్: ఒకే కుటుంబంలోని 11 మంది ఊపిరాడక మరిణించారు. ఈ ఘటన పాకిస్ధాన్‌లోని బెలూచిస్ధాన్ ప్రావెన్స్‌లోని జరిగింది. వివరాల్లోకి వెళితే... 11 మంది కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రపోయారు.

వారు నిద్రలోకి జారుకున్న తర్వాత ఇంట్లో గ్యాస్ లీక్ అయింది. దీంతో నిద్రపోతున్న వారంతా శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయారని పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టు మార్టం నిమిత్తం పిష్ని జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. ఈ మేరకు స్థానిక మీడియాలో వార్తకథానాలు ప్రసారం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications