Indonesia Volcano Erupts: ఇండోనేషియాలో అగ్ని పర్వతం విస్పోటనం.. 11 మంది మృతి..
ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో అగ్ని పర్వతాల విస్పోటనాలు జరుగుతుంటాయి. అగ్ని పర్వత విస్పోటనంతో చుట్టు పక్కల వారు వేడితో అల్లాడిపోవాల్సి వస్తుంది. తాజాగా పశ్చిమ ఇండోనేషియాలో అగ్నిపర్వతం పేలడంతో 11 మంది పర్వతారోహకులు మరణించారు. మరో 12 మంది గల్లంతయ్యారు. సుమత్రా ద్వీపంలో 2,891 మీటర్ల (9,484 అడుగులు) ఎత్తున్న మౌంట్ మెరాపి అగ్ని పర్వతం ఆదివారం విస్పోటనమైంది. ఈ ఘటనతో చుట్టుపక్కల కిలోమీటర్ల మేర బూడిద మేఘాలు కమ్మేశాయి. పేలుడుతో దాదాపు 3,000 మీటర్ల ఎత్తుకు బూడిద ఎగజిమ్మిందిని అధికారులు చెప్పారు.
సుమత్రా ద్వీపంలో 2,891 మీటర్లు (9,484 అడుగులు) గరిష్ట ఎత్తులో, మౌంట్ మరాపి ఆదివారం విస్ఫోటనం చెందింది. 3,000 మీటర్ల ఎత్తైన బూడిద ఆకాశంలోకి వచ్చింది. " పర్వత విస్పోటన సమయంలో 22 మంది పర్వతా రోహకులు అక్కడ ఉన్నారు. వారిలో 14 మందిని మేము కనుగొన్నాము. అందులో ముగ్గురు సజీవంగా ఉన్నారు. మిగతా 11 మంది చనిపోయారు" అని పదాంగ్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ అధిపతి అబ్దుల్ మాలిక్ చెప్పారు.

శనివారం నుంచి పర్వతంపై మొత్తం 75 మంది హైకర్లు ఉన్నారని, వారిని రెస్క్యూ టీం లెక్కించడానికి ప్రయత్నిస్తున్నారని మాలిక్ తెలిపారు. పన్నెండు మంది ఇంకా తప్పిపోయారు. "పర్వతారోహకులను సురక్షితంగా తీసుకురావడానికి రెస్క్యూ టీమ్‌లు రాత్రంతా పని చేస్తున్నాయి" అని పశ్చిమ సుమత్రా సహజ వనరుల సంరక్షణ సంస్థ పేర్కొంది. ఇండోనేషియాలోని మౌంట్ మెరాపి ప్రాంతంలో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.












Click it and Unblock the Notifications