వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐసిస్ పట్ల ఆకర్షితులవుతున్న ఆస్ట్రేలియా యువతులు

|
Google Oneindia TeluguNews

మెల్బోర్న్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ(ఐఎస్ఐఎస్) చాప కింద నీరులా ప్రపంచమంతా విస్తరిస్తోంది. తమ కార్యకలాపాలను విస్తరించుకునేందుకు పెద్ద ఎత్తున యువతను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా యువతులు కూడా ఇస్లామిక్‌ స్టేట్‌ పట్ల రోజురోజుకీ ఆకర్షితులౌతున్నారు.

ఇప్పటికే ఐదుగురు యువతులు ఇస్లామిక్‌స్టేట్‌(ఐఎస్‌)లో చేరారని పోలీసులు తెలిపారు. మరో 12మంది మహిళలు అందులో చేరేందుకు ఆస్ట్రేలియా నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారని వారు తెలిపారు.

ఇందులో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్న వారంతా 18 నుంచి 20 ఏళ్ల లోపువారేనని అధికారులు పేర్కొన్నారు. కుటుంబసభ్యులకు అబద్ధం చెప్పి ఆస్ట్రేలియాను వదిలివెళ్లి జీహాదీ వధువులుగా మారేందుకు వారు సంసిద్ధులవుతున్నారని తెలుస్తోంది.

12 Australian women have tried to join ISIS: police

‘ఇప్పటివరకూ పురుషులే ఇలా వెళ్తున్నారనుకున్నాం.. కానీ మహిళలు కూడా అలా వెళ్లిపోవడానికి ఆసక్తి చూపుతున్నారు. సంక్షోభ, యుద్ధ వాతావరణంలో జీవితం గురించి వారు గొప్పగా ఊహించుకుంటున్నారు' అని అధికారులు పేర్కొన్నారు.

కాగా, విలాసవంతమైన జీవితం కల్పిస్తామని ఆశచూపి 18 నుంచి 20 ఏళ్ల వయసున్న యువతులను సోషల్ మీడియా ద్వారా ఆకర్షిస్తోందని విక్టోరియా తీవ్రవాద నిరోధక దళం వెల్లడించింది. యువకులతో పోలిస్తే యువతులను సులభంగా బుట్టలో పడేయొచ్చన్న ఉద్దేశంతో వారికి ఐఎస్ ఎర వేస్తోందని తెలిపారు. ఐఎస్ మాయలో పడిన యువతులు కల్లోలిత సిరియా, ఇరాక్ లకు అక్రమంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు.

English summary
At least 12 Australian women from one city have attempted to join ISIS, police said Friday, warning of a trend towards a "romanticized view" of violent jihadis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X