"పోర్న్ సైట్" నడిపిస్తున్న 12ఏళ్ల బాలిక.. స్టోరీ తెలిస్తే మైండ్ బ్లాంక్ !
ఓ 12 ఏళ్ల బాలిక పోలీసులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఆ వయసులో ఎవరు ఊహించని పని చేసి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆ వయసులో సరిగ్గా పోర్న్ అంటే కూడా తెలియని వారు ఎందరో ఉండగా.. ఆ బాలిక మాత్రం ఏకంగా పోర్న్ వెబ్‌సైట్ ను నడిపిస్తున్నట్టు గుర్తించడంతో యావత్ పోలీస్ వ్యవస్థ సైతం ఖంగుతిన్నారు.
అయితే ఈ వ్యవహారం మన దేశంలో కాదు.. మలేషియాలో చోటు చేసుకోగా.. ఓ పోర్నోగ్రఫీ ఆపరేషన్‌ను ఛేదించే క్రమంలో ఈ విషయం బయటపడింది. ఆమెతో పాటు మరో నలుగురు స్నేహితులు కూడా ఈ వ్యాపారంలో పాలుపంచుకున్నట్లు సమాచారం.

సోషల్ మీడియా వేదికగా వ్యాపారం..
బాలిక తన వాట్సాప్ గ్రూప్‌లో 762 మంది సభ్యులను కలిగి ఉండేది. అయితే వారు షేర్ చేసిన అశ్లీల వీడియోలు, చిత్రాలను తానే క్రియేట్ చేసుకున్న పోర్న్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసేది. వాటిని ఆన్‌లైన్‌లో విక్రయిస్తూ నెలకు లక్షల్లో ఆదాయం సంపాదించింది. ఆమెకు వచ్చే ఆదాయం.. తన తల్లిదండ్రుల వేతనం కంటే ఎక్కువగా ఉండటంతో స్కూల్ చదువును మానేసి మరి పూర్తిగా ఈ వ్యాపారంపైనే దృష్టి పెట్టినట్టు పోలీసులు వెల్లడించారు.
అయితే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన నాటి నుంచి మలేషియా పోలీసులకు పెద్ద సవాలు ఎదురైంది. ఎందుకంటే.. చైల్డ్ యాక్ట్ 2001 కింద ఉన్న చట్టాల కారణంగా న్యాయపరమైన సమస్యలు వస్తున్నాయి. ఆ కారణంగా మైనర్ లను నేరుగా కోర్టులో విచారించలేరు. దాంతో పిల్లలపై కఠిన చర్యలు తీసుకుంటే మలేషియా హ్యూమన్ రైట్స్ కమిషన్ అభ్యంతరాలు చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది.
పార్లమెంట్‌లో ప్రస్తావన..
ఈ విషయం గురించి హోం మినిస్టర్ సైఫుద్దీన్ నసుషన్ ఇస్మాయిల్ పార్లమెంట్‌లో కూడా ప్రస్తావించారు. ప్రస్తుతం ఉన్న చైల్డ్ యాక్ట్‌లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. చిన్నారులు నేరాలలో ఇరుక్కుపోతే, వారిని ఎలా లీగల్‌గా హ్యాండిల్ చేయాలన్న దానిపై స్పష్టత అవసరమని చెప్పుకొచ్చారు. ఇందుకోసమ అనేక ఏజెన్సీలతో సమన్వయం తప్పనిసరి అవుతుందని తెలిపారు.

ఇక ఇప్పటికే ఈ కేసు విషయంలో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిజంగానే 12 ఏళ్ల బాలికే ఈ ఆపరేషన్ వెనుక మాస్టర్‌మైండా? లేక దీని వెనుక వేరే పెద్దల పాత్ర ఏదైనా ఉందా అని అనుమానిస్తున్నారు. ఆమెపై ఒత్తిడి చేశారా లేదా క్రిమినల్ గ్యాంగ్ హస్తం ఉందా? అని విచారణ చేస్తున్నారు. బాలికను ఉపయోగించి వాస్తవానికి పెద్దలు అక్రమ వ్యాపారం నడుపుతున్నారా? అనే కోణంలో సైతం ఆరా తీసుకున్నట్టు చెబుతున్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications