14 హిందూ దేవాయలపై దాడి, ధ్వంసం: ఎక్కడంటే.
బంగ్లాదేశ్ వాయువ్య ప్రాంతంలో ఏకంగా 14 హిందూ దేవాలయాలపై దాడులు చేసిన దుండగులు పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ మేరకు వివరాలను పోలీసులు ఆదివారం తెలిపారు.
ఢాకా: పాకిస్థాన్‌తోపాటు బంగ్లాదేశ్‌లోనూ మైనార్టీలైన హిందువులపై దాడులు పెరిగిపోతున్నాయి. బంగ్లాదేశ్ వాయువ్య ప్రాంతంలో ఏకంగా 14 హిందూ దేవాలయాలపై దాడులు చేసిన దుండగులు పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ మేరకు వివరాలను పోలీసులు ఆదివారం తెలిపారు.
రాత్రి సమయంలో ఒక్కసారిగా దుండగులు దాడి చేసి 14 హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారని స్థానిక బలియడంగీకి చెందిన హిందూ నేత బైద్యనాథ్ బర్మాన్ తెలిపారు. కొన్ని విగ్రహాలు ధ్వంసమయ్యాయని, ఆలయ స్థలాల్లోని చెరువు నీటిలో కొన్ని కనిపించాయని ఉపజిల్లా పూజా సెలబ్రేషన్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి అయిన బర్మాన్ వెల్లడించారు.
దేవాలయాలపై దాడులు చేసి ధ్వంసానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బర్మన్. మరో హిందూ నేత, యూనియన్ పరిషద్ చైర్మన్ సమర్ ఛటర్జీ మాట్లాడుతూ.. దేవాలయాలపై దాడులు చేసి ధ్వంసం చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు ఇక్కడ గతంలో ఎన్నడూ జరగలేదని చెప్పారు.

స్థానిక మెజార్టీ ముస్లింలతో తాము కలిసి జీవిస్తున్నామని, వారు కూడా మాతో బాగానే ఉంటారని.. అయితే, ఈ దాడులు ఎవరు పాల్పడ్డారనే విషయం మాత్రం తెలియరావడం లేదని ఛటర్జీ తెలిపారు.
ఈ ప్రాంతంలోని పలు దేవాలయాలపై శనివారం అర్ధరాత్రి తర్వాత దేవాలయాలపై దాడులు జరిగాయని బలియడంగి పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ అధికారి ఖైరుల్ ఆనమ్ తెలిపారు. దేశంలోని శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేందుకే దుండగులు ఈ దాడులకు పాల్పడుతున్నారని మరో పోలీస్ ఉన్నతాధికారి జహంగీర్ హోస్సేన్ ఆరోపించారు.
దేవాలయాలపై దాడులు చేసి, విధ్వంసం చేసిన నిందితులను పట్టుకుని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇలాంటి దాడులకు పాల్పడినవారికి కఠిన శిక్షలు పడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications