గిఫ్ట్ బాక్స్ అందుకున్న 14 ఏళ్లకు, అతడినే పెళ్లాడింది

ఢిల్లీ: ఫిలిప్పినోకు చెందిన ఓ యువతి పద్నాలుగేళ్ల క్రితం తనకు ఓ గిఫ్ట్ బాక్స్ పంపించిన ఓ యువకుడిని పెళ్లాడింది. ఆ యువతికి 2000వ సంవత్సరంలో ఏడేళ్ల బాలుడు ఓ బహుమతిని పంపించాడు. ఆ బహుమతి పంపించిన యువకుడిని పెద్దయ్యాక పెళ్లాడతానని ఎప్పుడు ఊహించకపోయి ఉంటుంది.

అది పద్నాలుగేళ్ల తర్వాత. పిలిప్పినోకు చెందిన జోవానా, టైరెల్‌లు పెళ్లి చేసుకున్నారు. ఈ సమయంలో వారు తమ పాత జ్ఞాపకాలను చెప్పారు.

జోవానా 2000వ సంవత్సరంలో కిజోనా సిటీలో చదువుకుంటున్న సమయంలో ఓ గిఫ్ట్‌ను అందుకుంది. ఆ బాక్సులో చిన్న పిల్లాడి ఫోటో, కౌబాయ్ షర్ట్ ఉన్నాయి. అందులో అతని పేరు, చిరునామా కూడా ఉంది. తనకు బహుమతి పంపించిన ఆ బాలుడికి లేఖ రాయాలనుకుంది. ఆమె ఓ లేఖ రాసి పంపించింది. కానీ అది అతనికి చేరలేదు.

14 years after receiving shoebox gift, girl marries boy

ఇదిలా ఉండగా, పదకొండేళ్ల తర్వాత జోవానా తనకు అప్పుడు గిఫ్ట్ బాక్స్ ఇచ్చిన వ్యక్తిని కనుక్కోవాలనుకుంది. అందుకు ఫేస్‌బుక్ ద్వారా అతని దొరికితే దొరకవచ్చుననుకుంది. ఫేస్‌బుక్‌లో.. తనకు బాక్స్‌ను బహుమతిగా ఇచ్చిన వ్యక్తికి ఇప్పటికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానని ఆమె రాసింది. అతని పేరు పేర్కొంది.

ఇదాహో అనే చిన్న పట్టణానికి చెందిన ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతనికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించింది. వారి ఫేస్‌బుక్ పరిచయం అలా కొంతకాలం కొనసాగింది. వారు ఏడాది పాటు సందేశాలు, ఫోటోలు పంపించుకున్నారు. అదే సమయంలో తమ ఇద్దరి టేస్టులు ఒకటే అని గుర్తించారు. ఇద్దరికీ సంగీత సాధనాలు అంటే ఇష్టమే. అనంతరం ఇరువురు ఒకరిని మరొకరు చూసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో చిన్నప్పటి విషయాలు తెలిశాయి. అనంతరం వారు పెళ్లి చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+