అమెరికాలో హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు
వాషింగ్టన్: అమెరికాలో హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు కావడంతో 15 మందిని అరెస్టు చేశారు. లాటిన్ అమెరికన్ మహిళలు, బాలికను రక్షించి వారికి పునరావాసం కల్పించామని అమెరికన్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ అధికారులు తెలిపారు.
సెక్స్ రాకెట్ నడుపుతున్నారని 29 మందిని అదుపులోకి తీసుకుని వారి మీద అమెరికాలో కేసులు నమోదు చేశారు. మెక్సికో, సెంట్రల్ అమెరికాకు చెందిన మహిళలు, బాలికలను మభ్యపెట్టి, వారికి ఎరవేసి అక్రమంగా సరిహద్దు దాటించిన తరువాత బలవంతంగా ఈ కూపంలోకి నెట్టుతున్నారని విచారణలో వెలుగు చూసింది.
ఈ క్రమంలోనే చాలామంది మహిళలు, బాలికలను మోసగించి, భయపెట్టి వ్యభిచార కూపంలోకి దింపారు. సవన్నా, మౌల్ట్రీ నగరాలు కేంద్రంగా ఈ సెక్స్ రాకెట్ తన కార్యకలాపాలు నిర్వహిస్తోందని అధికారుల విచారణలో వెలుగు చూసింది.

13 నగరాలలో గాలించి నిందితులను అరెస్టు చేశారు. 15 నెలల విచారణ అనంతరం హోం ల్యాండ్ సెక్యూరిటి ఏజెన్సీ అధికారులు వీరి మీద అభియోగాలు నమోదు చేశారు. ఈ సెక్స్ రాకెట్ కు సంబంధించి ఓ ముఠా జార్జియా రాష్ట్రంలో ఉందని అధికారులు గుర్తించారు.
సుధీర్ఘ విచారణ అనంతరం 15 మంది మీద నేరం రుజువు అయ్యింది. నిందితులకు జీవిత ఖైదుతో పాటు భారత కరెన్సీ ప్రకారం రూ. 1.60 కోట్ల జరిమానా విధించే అవకాశం ఉందని అమెరికా అధికారులు తెలిపారు. ఈ ముఠా నాయకుల కోసం అధికారులు గాలిస్తున్నారు.
బాధితులకు అమెరికాలోనే పునరావాసం ఏర్పాటు చేశామని, న్యాయస్థానం ఆదేశాల మేరకు వారికి రక్షణ కల్పిస్తున్నామని అధికారులు అన్నారు. అంతే కాకుండ వారికి మూడు సంవత్సరాల పాటు తాత్కాలిక వీసా సౌకర్యాన్ని కల్పించామని, తరువాత వారు శాస్వత వీసా కోసం దరఖాస్తు చేసుకునే వీలు కల్పించామని అధికారులు తెలిపారు .












Click it and Unblock the Notifications