ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. 15 కంపెనీలు బ్లాక్‌లిస్ట్‌లో.. ఇవే ఆ కంపెనీలు..
వాషింగ్టన్: ట్రంప్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఒకవైపు హెచ్1బీ వీసాలపై రోజుకో చర్చ జరుగుతుండగానే.. మరోవైపు అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్1బీ వీసాలకు దరఖాస్తు చేయకుండా... 15 కంపెనీలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది.
అమెరికాలో హెచ్-1బీ, ఎల్1 వంటి నాన్-ఇమ్మిగ్రాంట్ వీసాలను రెన్యువల్ చేయించుకోవడం ప్రస్తుతం చాలా క్లిష్టతరంగా మారింది. ట్రంప్ కార్యాలయం తీసుకొస్తున్న నిబంధనలతో హెచ్-1బీ వీసాదారులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది.

అమెరికన్ వర్కర్లను కాపాడటానికి ట్రంప్ కార్యాలయం హెచ్-1బీ వీసాల్లో కొత్త కొత్త పాలసీలను తీసుకొస్తోన్న సంగతి తెలిసిందే. అయితే భారత టెక్కీలకు కొంత ఊరట ఏమిటంటే.. తమ దేశం నుంచి బలవంతంగా హెచ్-1బీ వీసాదారులను పంపే ప్రతిపాదనేమీ లేదని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేయడం.
ఇవే ఆ 15 కంపెనీలు...
అజెల్ టెక్నాలజీస్ ఇన్‌కార్పొరేషన్, అమికా టెక్నాలజీ సొల్యూషన్స్ ఎల్‌ఎల్‌సీ, క్లిన్‌రాన్ ఎల్‌ఎల్‌సీ203, డెల్టా సెర్చ్ ల్యాబ్స్ ఇన్‌కార్పొరేషన్, ఫోస్కామ్ డిజిటల్ టెక్నాలజీస్ ఎల్‌ఎల్‌సీ,
జీ హెల్త్‌కేర్ ఎల్‌ఎల్‌సీ, ఇంకోన్ కార్పొరేషన్, ఇంక్, ఎండీ2 ఇన్‌కార్పొరేషన్, నార్తరన్ కాలిఫోర్నియా యూనివర్సల్ ఎంటర్‌ప్రైజ్ కార్పొరేషన్, ఎన్‌వైసీ హెల్త్‌కేర్ స్టాఫింగ్ ఎల్‌ఎల్‌సీ,
నిచె సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ఇన్‌కార్పొరేషన్, రైడ్‌స్ట్రా డైరీ, లిమిటెడ్, తెలవా నెట్‌వర్క్స్ ఇన్‌కార్పొరేషన్, టెక్‌వైర్ సొల్యూషన్స్ ఇన్‌కార్పొరేషన్, మాక్రో నెట్‌వర్క్స్ కార్పొరేషన్.












Click it and Unblock the Notifications