రష్యాలో కూలిన హెలికాప్టర్: 15 మంది మృతి
న్యూఢిల్లీ: రష్యాలో హెలికాప్టర్ కూలి 15 మంది దుర్మరణం పాలయ్యారు. సైబీరియాలోని క్రాస్నోయార్స్క్ ప్రాంతంలో 22 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో వెళ్తున్న Mi-8 హెలికాప్టర్ పశ్చిమ సైబీరియాలోని ఇగరక సిటీ శివారులో కూలిపోయింది.
ఈ ప్రమాదంలో 15 మంది అక్కడికక్కడే మరణించిగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇగరక విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన 15 నిమిషాల్లోనే కూలిపోయింది. ఈశాన్య మాస్కో నుంచి 2800 కిలోమీటర్ల దూరంలో సైబీరియా ఉంది.
విమానాశ్రయం నుంచి ఆ హెలికాప్టర్ స్థానిక ఆయిల్ పంపింగ్ స్టేషన్‌కు వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే హెలికాప్టర్ కూలిపోయిందని ఇగరక సిటీ అధికారులు వెల్లడించారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.
#BREAKING: A Mi-8 helicopter crashed in #Russia's Krasnoyarsk region, killing at least 12 on board pic.twitter.com/H2QyxcdhiJ
— Russian Market (@russian_market) November 26, 2015 Russian helicopter carrying oil workers crashes killing 10 people https://t.co/CRHukJQDq1 pic.twitter.com/BWKuNCCFds
— Daily Mirror (@DailyMirror) November 26, 2015 











Click it and Unblock the Notifications