వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇప్పుడే కాదు.. 15 వేల ఏళ్ల క్రితం వైరస్: చైనాలో

|
Google Oneindia TeluguNews

కరోనా పుట్టినిల్లు చైనా.. అక్కడ మాత్రం వైరస్ మాటే లేదు. అయితే చైనాలో ఇప్పుడే కాదు పూర్వం కూడా వైరస్ ఆనవాళ్లు ఉన్నాయి. టిబెట్ పర్వత ప్రాంతంలో 15 వేల ఏళ్ల నాటి వైరస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. అవీ మంచులో గడ్డకట్టి ఉన్నాయని వివరించారు. చాలా ఏళ్లు మంచులో ఉండటం వల్ల అవి యాక్టివ్ గా ఉండొచ్చని, వాటిని ల్యాబ్ లో పరీక్షించాల్సి ఉందని చెప్పారు.

శాంపిల్స్ సాయంతో ఆ కాలంలో వైరస్ గురించి అధ్యయనం చేయొచ్చని, దీంతో ఇప్పుడు ఉన్న పలు వ్యాధులు, వైరస్ అంతానికి పరిష్కారం దొరకొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. రెండు మంచు ముక్కల్లో శాస్త్రవేత్తలు వైరస్ గుర్తించారు. ఆ కాలం నాటి వైరస్ గురించి అధ్యయనం చేసేందుకు సైంటిస్టులు కొత్త పద్దతిని ఎంచుకున్నారు. దానినే అల్ట్రా క్లీన్ విధానం అంటారు.

15 thousand years ago virus found in china

Recommended Video

Coronavirus: 2015 లోనే కరోనా వైరస్, చైనా Scientists బయో వెపన్ రీసెర్చ్ డాక్యుమెంట్లు|Oneindia Telugu

హిమానీనదాలు క్రమంగా ఏర్పడ్డాయిని.. దుమ్ము, వాయువులతోపాటు, వైరస్ కూడా ఆ మంచులో నిక్షేపించబడ్డాయని ఒహియో స్టేట్ వర్సిటీ బైర్డ్ పోలార్ అండ్ క్లైమేట్ రీసెర్చ్ సెంటర్ పరిశోధకుడు, ప్రధాన రచయిత జిపింగ్ జాంగ్ చెప్పారు. పశ్చిమ చైనాలో గల హిమానీనదాలు బాగా అధ్యయనం చేయబడలేదన్నారు. వాతావరణాలను ప్రతిబింబించేలా సమాచారాన్ని ఉపయోగించడం లక్ష్యం అని చెప్పారు. వైరస్ ఆ వాతావరణాలలో ఒక భాగం అని జాంగ్ తెలిపారు.

పశ్చిమ చైనాలోని గులియా ఐస్ క్యాప్ నుండి 2015లో తీసిన ఐస్ కోర్‌ను ఈ బృందం విశ్లేషించింది. మంచు ఉద్భవించిన గులియా శిఖరం సముద్ర మట్టానికి 22 వేల అడుగుల ఎత్తులో ఉంది. మంచును విశ్లేషించిన సమయంలో 33 వైరస్‌లకు జన్యు సంకేతాలను కనుగొన్నారు. నాలుగు వైరస్‌లను ఇప్పటికే శాస్త్రీయ సమాజం గుర్తించింది.

English summary
15 thousand years ago virus found have been in china tibet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X