సైనిక విమానం కూలి 16 మంది మృతి
అమెరికాలోని దక్షిణాది రాష్ట్రం మిస్సిసిప్పిలో సైనిక విమానం కూలి 16 మంది మృతి చెందినట్లుగా అమెరికా మీడియాలో వార్తలు వచ్చాయి.
వాషింగ్టన్: అమెరికాలోని దక్షిణాది రాష్ట్రం మిస్సిసిప్పిలో సైనిక విమానం కూలి 16 మంది మృతి చెందినట్లుగా అమెరికా మీడియాలో వార్తలు వచ్చాయి.
విమానం కూలిన అనంతరం శకలాలు కొన్ని మైళ్ల దూరం వరకూ పడిపోయినట్లు తెలిపారు. మృతదేహాలకోసం గాలింపు చర్యలు చేపట్టారు.

లెఫ్లోర్ కౌంటీలో తీరప్రాంత గస్తీ దళానికి చెందిన కేసీ 130 రవాణా విమానం కూలిపోయింది. ఈ విమానాన్ని ఇంధన రవాణా కోసం వినియోగిస్తున్నారు.
విమానం కూలిన వెంటనే భారీగా మంటలు వచ్చాయి. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు సహాయకచర్యలు చేపట్టారు. కొన్ని మృతదేహాలను గుర్తించారు. మిగతా వాటి కోసం గాలింపు చేపట్టారు.












Click it and Unblock the Notifications