అంగీకారంతోనే: సెక్స్ చేస్తుండగా గొంతు పిసికిన గర్ల్!
న్యూయార్క్: శృంగారం సమయంలో ఓ వ్యక్తిని హత్య చేశారనే ఆరోపణలతో పదహారేళ్ల అమ్మాయి అదుపులోకి తీసుకున్న సంఘటన అమెరికాలో జరిగింది. ఇద్దరి అంగీకారంతో శృంగారంలో పాల్గొంటుండగా అతను చనిపోయినట్లు అమ్మాయి చెప్పినట్లుగా పోలీసులు చెబుతున్నారు.
శనివారం నాడు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వెస్ట్ ఓలైవ్ అవెన్యూ అపార్టుమెంటులో ఓ వ్యక్తి గాయాలతో పడి ఉన్నారని గ్లెండేల్ పోలీసులకు సాయంత్రం ఐదు గంటల నలభై అయిదు నిమిషాలకు సమాచారం అందింది. పోలీసులు అక్కడకు వెళ్లే సరికి అతను మృతి చెందాడు. అతనిని 43 ఏళ్ల జాసన్ ఆష్‌గా గుర్తించారు.

జాసన్ ఆష్ మృతదేహం పైన పోలీసులు పలు గాయాలను గుర్తించినట్లుగా తెలుస్తోంది. అతని మెడ చుట్టు ఓ తాడు బిగించబడి ఉంది. తాము అపార్టుమెంటులోకి వెళ్లే ముందు పదహారేళ్ల అమ్మాయి అక్కడి నుండి పారిపోయినట్లుగా గుర్తించామని పోలీసులు చెప్పారు.
ఆమె పారిపోతుండగా స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఆ అమ్మాయిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు, శృంగారం సమయంలో జాసన్ ఆష్‌ను చంపినట్లుగా అమ్మాయి అంగీకరించినట్లుగా తెలుస్తోంది. పోలీసులు కేసును విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications