షాకింగ్: బ్రెయిన్ సర్జరీ చేస్తుండగా మేల్కొని, ప్రశ్నలడిగిన యువతి
వాషింగ్టన్: తనకు బ్రెయిన్ సర్జరీ జరుగుతుండగా ఓ టీనేజ్ గర్ల్‌కు మెలకువ వచ్చింది. ఈ సంఘటన పోలాండ్‌లో జరిగింది. మెలకువ వచ్చిన ఆ టీనేజ్ గర్ల్ తన ఆపరేషన్ ఎలా జరుగుతోందని సర్జరీ చేస్తున్న వైద్యులను ప్రశ్నించిందట. 19 ఏళ్ల ఇగా జెసికాకు బ్రెయిన్‌లో క్యాన్సర్ కారకమైన ఆపరేషన్ జరుగుతోంది.
ఈ సమయంలో సర్జరీ సగం అయ్యాక ఆమెకు హఠాత్తుగా మెలకువ వచ్చింది. దీంతో డాక్టర్లు షాకయ్యారు. అప్పటికే సర్జరీలో భాగంగా ఆమె పుర్రెలోని కొంత భాగాన్ని తీశారు. అలాంటి సమయంలో ఆమె మేల్కొని సర్జరీ విషయమై వారిని కొన్ని ప్రశ్నలు అడిగిందట.

అయితే, ఆ సమయంలో ఆమె సర్జరీని చూడలేదని, ఎలాంటి ఫీల్ ఉండదని నిపుణులు చెబుతున్నారు. బ్రెయిన్ సర్జరీ నేపథ్యంలో ఇలా జరగవచ్చుని చెబుతున్నారు. మరోవైపు, అనెస్తెటిక్ విషయంలో ఏదైనా పొరపాటు జరిగిందా అనే కోణంలోను ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications