సాహసం చేయకురా డింభకా : 18వ అంతస్థులో స్టంట్.. కిందపడి యువకుడి మృతి

బీజింగ్ : సాహసం చేయరా డింభకా అనేది పాత మాట. సాహసం చేయకురా నాయనా అనేది నేటి తీరుగా ఉంది. సోషల్ మీడియా పుణ్యమో ఏమో గానీ.. ఒకరిని చూసి ఒకరు స్టంట్ల మీద స్టంట్లు చేస్తున్నారు. అయితే సాహసాల మాటున ప్రమాదాలు పొంచి ఉన్నాయనే విషయం గుర్తించలేకపోతోంది నేటి తరం. చైనాలో ఇలాగే సాహసం పేరిట 18 అంతస్థులపైకెక్కిన 19 ఏళ్ల విద్యార్థి అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయాడు.

సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్ ప్రాంతంలో ఉన్న ఓల్డ్ క్వియాంగ్ లో సాహసం చేసేందుకు సిద్ధమయ్యాడు యాంగ్. అక్కడే ఉన్న 18 అంతస్థుల భవనమెక్కాడు. అయితే అతను అంచు చివరన నిల్చోవడం.. క్షణాల్లో కిందకు పడిపోవడం చకచకా జరిగిపోయాయి. ఒక్కసారిగా 18 అంతస్థుల నుంచి పడిపోవడంతో ఆ యువకుడు స్పాట్ లో ప్రాణాలు కోల్పోయాడు.

19 years student falls to his death from 18-storey rooftop

సాహసం మాటున ప్రమాదాలు పొంచి ఉంటాయని చెబుతూ.. ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలను ముంబయి పోలీసులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. వాస్తవానికి ఈ ప్రమాదం ఏప్రిల్ 22న జరిగినట్లు తెలుస్తోంది. బిల్డింగ్ అంచు చివరన నిలబడి ఫోన్ కాల్ చేస్తూ స్టంట్ చేయబోయాడని సమాచారం. అయితే సడెన్ గా కొద్ది భాగం పెచ్చులూడి పడటంతో ఈ ప్రమాదం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+