వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాల్‌మార్టులో తల్లిని కాల్చి చంపిన రెండేళ్ల బాలుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

హెడెన్, ఇదాహో: రెండేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు తన 29 ఏళ్ల తల్లిని ఉత్తరాది ఇదాహో వాల్‌మార్ట్‌లో కాల్చి చంపాడు. ఆమె పర్సును తెరుస్తూ అతను ఆయుధం తీసి తల్లిని ప్రమాదవశాత్తు కాల్చి చంపాడు. వివరాలు ఇలా ఉన్నాయి - వెరోనికా రూట్లెడ్డ్ అనే మహిళ తన కుమారుడితో పాటు చిన్న పట్టనం హెడెన్‌లో షాపింగ్ చేస్తోంది. షాపింగ్ కార్టులో కూర్చున్న బాలుడు ఆయుధం చూసి, దాన్ని పేల్చాడు.

వెరోనికా రెట్లెడ్డ్ దాచి ఉంచిన ఆయుధం పర్సు తెరవగానే అతని కంట పడింది. ఆ సమయంలో ఆమె తన కుమారుడితో పాటు మరో ముగ్గురు పిల్లలతో షాపింగ్ చేస్తోంది. ఇదాహోలోని బ్లాక్‌ఫుట్‌కు చెందిన వెరోనికా తన బంధువులను చూడడానికి వచ్చింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

2-year-old accidentally kills his mom in Wal-Mart

షాపింగ్ కార్టులో కూర్చున్న బాలుడు తల్లి పర్సు తీసుకుని, చిన్నపాటి కాలిబర్ హ్యాండ్‌గన్‌ను తీసుకున్నాడు. ఆ సమయంలో అది పేలిందని అధికార వర్గాలు చెప్పాయి. ఇది విషాదకరమైన ప్రమాదమని అధికార వర్గాలు అంటున్నారు.

వెరోనికా అందమైన, యువతి అని, అత్యంత ప్రేమాస్పదురాలని ఆమె మామ అన్నాడు. కాల్పులు జరిగినప్పుడు ఆమె భర్త స్టోర్‌లే లేడు. వెంటనే అతను వచ్చాడని, పిల్లలను బంధువుల ఇంటికి తీసుకుని వెళ్లారని అధికారులు చెప్పారు. వాషింగ్టన్‌లోని స్పోకానేకు 40 కిలోమీటర్ల దూరంలో ఇదాహో, హెడెన్ వాల్‌మార్ట్ ఉంది. ఆ సంఘటన జరిగిన వెంటనే స్టోర్‌ను మూసేశారు. కాల్పులు అత్యంత విషాదకరమైన ప్రమాదమని స్టోర్ వర్గాలు అంటున్నాయి.

English summary
A 2-year-old boy accidentally shot and killed his mother after he reached into her purse at a northern Idaho Wal-Mart and her concealed gun fired, authorities said Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X