శత్రువుల పైన నిఘా కోసం రోబో ఈగ!
లాస్ ఏంజిల్స్: శత్రువుల వ్యుహాలను పసిగట్టగలిగే ఓ రోబో ఈగను అమెరికా సైనిక పరిశోధనశాల ప్రత్యేకంగా రూపొందించిందట. గాలిలో ఎగిరేందుకు రెక్కలను, అవసరమైతే నడిచేందుకు కాళ్లతో ఈ గూఢచారి రోబో ఈగను అభివృద్ధి చేశారట.
అనుకోకుండా తల్లిని తుపాకీతో షూట్ చేసి చంపిన రెండేళ్ల చిన్నారి
అమెరికాలో ఓ రెండేళ్ల చిన్నారి అనుకోకుండా తన తల్లిని తుపాకీతో షూట్ చేశాడు. ఈ ఘటనలో ఆమె చనిపోయింది. ఈ సంఘటన మంగళవారం నాడు ఇడాహోలోని వాల్ మార్ట్ స్టోర్‌లో జరిగింది. ఆ బాలుడు తన తల్లి బ్యాగ్ నుండి తుపాకీ తీసుకున్న అనంతం ఇది జరిగింది.
ఆ కాల్చిన వ్యక్తిని పోలీసులు వెరోనికా రుట్లేజ్‌గా గుర్తించారు. ఆ తల్లి తన పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి వాల్ మార్ట్ స్టోర్‌లో మంగళవారం షాపింగ్ చేస్తోంది. ఆ సమయంలో అతను తుపాకీతో అనుకోకుండా కాల్చాడు. మృతురాలి వయస్సు 29 ఏళ్లు.

తమ స్టోర్‌లో చాలా బాధాకరమైన సంఘటన జరిగిందని, తమ స్టోర్‌కు వచ్చిన మహిళా కస్టమర్ చనిపోయారని లోకల్ వాల్ మార్ట్ స్టోర్ ప్రకటన చేసింది. తాము విచారణలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తామని చెప్పింది.












Click it and Unblock the Notifications