20 ఫైటర్ జెట్స్ ఎంట్రీ, తైవాన్ రక్షణ జోన్‌లోకి ప్రవేశం.. పెలోసి పర్యటన నేపథ్యంలోనే..

తైపీలో అమెరికా హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసి అడుగిడారో లేదో.. చైనా తన అక్కసును వెళ్లగక్కుతోంది. తన పగ, ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇప్పటికే 20 మిలిటరీ విమానాలు తైవాన్ రక్షణ జోన్‌లోకి వచ్చాయని తైపీ అధికారులు తెలిపారు. తైవాన్ నైరుతి ప్రాంతంలోకి విమానాలు వచ్చాయని వాయుసేన పేర్కొంది.

మంగళవారం సాయంత్రం పెలోసి తైవాన్‌లో దిగారు. దీంతో చైనా హెచ్చరికలు జారీచేస్తూనే ఉంది. బెదిరింపులకు పాల్పడుతూనే ఉంది. అగ్రరాజ్యల మధ్య గొడవ ప్రపంచాన్ని భయానికి గురిచేస్తోంది. తైవాన్ తమలో అంతర్భాగమేనని చైనా అంటోంది. పెలోసి అమెరికా సైనిక విమానంలో ప్రయాణించారు. తైపీలోని సాంగ్ షాన్ విమానాశ్రయంలో తైవాన్ విదేశాంగ మంత్రి జోసెఫ్ వు ఘన స్వాగతం పలికారు.

 20 Chinese Fighter Jets Enter Taiwan Airspace As Nancy Pelosi Visits

పెలోసి తైవాన్ పర్యటన నిబంధనల మేరకే జరుగుతుందని తెలిపారు. తమకు మద్దతు తెలుపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పెలోసి ఆసియా పర్యటనలో ఉన్నారు. ఆ క్రమంలోనే తైవాన్‌లో అడుగు పెట్టారు. ఇదీ చైనాకు నచ్చడం లేదు.

చైనా హెచ్చరికలు జారీచేసిన.. నాన్సీ పెలోసి మాత్రం తైవాన్‌లో గల తైపీలో అడుగుపెట్టారు. తైవాన్‌లో ప్రజాస్వామ్యం మనగలిగేందుకు అమెరికా మద్దతు ఇస్తోందని తెలిపారు. తైవాన్ అధినేతతో చర్చలు జరుపుతామని తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని అభివృద్ది చేయడానికి తోడ్పటును అందిస్తామని వివరించారు. తైవాన్‌లో గల 23 మిలియన్ల ప్రజలకు అమెరికా అండగా ఉంటుందని వివరించారు. గతంలో కన్నా ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉందన్నారు. నిరంకుశత్వం, ప్రజాస్వామ్యం మధ్య ఎంపికను ప్రపంచం ఎదుర్కొబోతుందని పెలోసి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+