ఒక్క లెటర్ కు 20 కోట్లు.. వేలంలో భారీ ఆఫర్.. ఎవరిదో తెలుసా?

న్యూయార్క్‌ : విశ్వ ప్రఖ్యాత ఐన్‌స్టీన్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన రాసిన "గాడ్ లెటర్" ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. 1954 జనవరి 3వ తేదీన రాసిన ఆ రెండు పేజీల లేఖ భారీ ధర పలకడం విశేషం. అమెరికాలో క్రిస్టీస్ సంస్థ వేలం వేసిన ఈ లెటర్ దాదాపు 20 కోట్ల (2.89 మిలియన్ డాలర్లు) రూపాయల ధర పలికింది. వాస్తవానికి "గాడ్ లెటర్" 1.5 మిలియన్ డాలర్లు పలుకుతుందని ఆ సంస్థ అంచనా వేసింది. అనూహ్యంగా భారీ ధర పలికి వారి అంచనాలు తారుమారు చేసింది.

ఐన్‌స్టీన్‌ చనిపోవడానికి ఒక సంవత్సరం ముందు రాసిన లేఖ ఇది. మతం, దేవుడు అనే అంశంపై తన అభిప్రాయాలు, ఆలోచనలు ఆ లేఖలో పొందుపరిచారు. జర్మన్ ఫిలాసఫర్ ఎరిక్ గుట్కైండ్ తాను రాసిన ఓ పుస్తకాన్ని ఐన్‌స్టీన్‌ కు పంపించిన సమయంలో ఈ లెటర్ ను ఆయనకు పంపించారు. దేవుడు అనే పదం వ్యక్తీకరణ అని, భావజాలమని.. మనుషుల బలహీనతల్లోంచి వచ్చిన పదమని ఆ లేఖ సారాంశం.

20 Crores for One Letter, Big Offer in Auction
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+