పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదం, బస్సును ఢీ కొన్న రైలు, 20 మంది మృతి, పలువురి పరిస్థితి విషమం
పాకిస్తాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ప్యాసెంజర్ రైలు-బస్సును ఢీ కొంది. దీంతో 20 మంది ప్రయాణికులు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. సుక్కూరు జిల్లా రోహ్రీలో ప్రమాదం జరిగింది. కరాచీ నుంచి రావల్పిండి వస్తోన్న రైలు.. కరాచీ నుంచి సర్గోదా వెళ్తున్న బస్సును మానవరహిత రైల్వే క్రాసింగ్ గేట్ వద్ద ఢీ కొన్నది.
ప్రమాదంలో గాయపడ్డ వారి పరిస్థితి విషమంగా ఉందని సుక్కూరు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వివరించారు.

రైలు బస్సును ఢీ కొనడంతో తునాతునలకైంది. బస్సును రైలు 200 అడుగుల వరకు లాక్కొని వెళ్లింది. దీంతో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రయాణికుల హాహాకారాలతో ఆ ప్రాంతం మార్మోగుతోంది. ప్రమాదం జరిగిన ఘటన స్థలానికి సహాయక బృదాలను తరలించాని సింద్ సీఎం మురాద్ అలీ షా
అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications