యూఎస్‌లో పెరిగిన భారతీయ విద్యార్థులు
వాషింగ్టన్: అమెరికాలోని పలు యూనివర్శిటీలు, విద్యా సంస్థలలో భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గురువారం యూఎస్ విడుదల చేసిన వివరాల ప్రకారం గత సంవత్సరం కంటే ఇప్పుడు 20 శాతం మంది విద్యార్థులు పెరిగారని తెలిపారు.
గురువారం యూఎస్ అధికారికంగా ఓ నివేదిక విడుదల చేసింది. ఈ ఏడాది (2015) జులై నుంచి నవంబర్ వరకు అమెరికాలోని వివిధ యూనివర్శిటీలు, కాలేజీలలో 1.8 లక్షల మంది భారతీ విద్యార్థులు చదువుతున్నారని పేర్కొంది.

యూఎస్ లో భారతీయ విద్యార్థులు ఎంత మంది ఉన్నారని ప్రతి సంవత్సరం అధికారికంగా నివేదిక విడుదల చేస్తుంది. గత ఏడాది కంటే ఈ సంవత్సరం 20.7 శాతం మంది విద్యార్థులు ఉన్నత విద్య చదువుతున్నారని తెలిపింది.
ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన 1.2 మిలియన్ల మంది విద్యార్థులు యూఎస్ లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నారని నివేదికలో పేర్కొంది. యూఎస్ లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల జాబితాలో మొదట చైనా, తరువాత వరుసగా భారత్, దక్షిణ కొరియా దేశాలు ఉన్నాయని నివేదిక వెల్లడించింది.












Click it and Unblock the Notifications