H1B Visa ఫీజు పెంపు వ్యవహారంలో అనూహ్య పరిణామం
హెచ్ 1బీ వీసా ఫీజు పెంపు వ్యవహారం.. అనూహ్య మలుపు తిరిగింది. దీన్ని సవాల్ చేస్తూ న్యాయస్థానంలో పలు పిటీషన్లు దాఖలయ్యాయి. అమెరికాలో 20 రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. ఇది చట్టవిరుద్ధమని, ప్రజలకు అందే సేవలకు విఘాతమనీ వాదించాయి ప్రభుత్వ రంగ సంస్థలపై తీవ్ర ఆర్థిక భారం పడిందని, వ్యూహాత్మక రంగాల్లో ప్రొఫెషనర్ల కొరతను తీవ్రతరం చేసిందని ఆందోళన వ్యక్తంచేశాయి. ఫీజు పెంపును తక్షణమే నిలిపివేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరాయి.
ఈ దావాను కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రోబ్ బోంటా, మసాచుసెట్స్ అటార్నీ జనరల్ ఆండ్రియా జాయ్ కాంప్‌బెల్ సంయుక్తంగా దాఖలు చేశారు. అరిజోనా, కొలరాడో, కనెక్టికట్, డెలావేర్, హవాయి, ఇల్లినాయిస్, మేరీల్యాండ్, మిచిగాన్, మిన్నెసోటా, నెవాడా, నార్త్ కరోలినా, న్యూజెర్సీ, న్యూయార్క్, ఒరెగాన్, రోడ్ ఐలాండ్, వెర్మోంట్, వాషింగ్టన్, విస్కాన్సిన్ రాష్ట్రాల అటార్నీ జనరల్స్ కూడా ఇందులో పాలుపంచుకున్నారు.

సెప్టెంబర్ 19న డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచిన విషయం తెలిసిందే. దీనిపై విదేశాల్లోనే కాకుండా అటు స్వదేశంలోనూ తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. అమెరికాలోనూ దీన్ని వ్యతిరేకించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. లక్ష డాలర్ల ఫీజును విధించడాన్ని సవాలు చేస్తూ పలు అసోసియేషన్లను కలిసి ఉమ్మడిగా ఈ పిటీషన్ ను దాఖలు చేశాయి. పలు ఉద్యోగ సంఘాల యూనియన్లు, విద్యావేత్తలు.. కాలిఫోర్నియా నార్త్ డిస్ట్రిక్ట్ కోర్టును ఆశ్రయించాయి.
ఈ వ్యవహారంలో యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఎంటర్ అయింది. ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ పాలసీ ఆఫీసర్ నీల్ బ్రాడ్లీ ఈ పిటీషన్ ను దాఖలు చేశారు. ఫీజు పెంపు వల్ల అమెరికాలో ఉద్యోగుల కొరత ఏర్పడుతుందని, ప్రత్యేకించి- స్టార్టప్‌లు, చిన్న, మధ్యతరహా సంస్థలకు ఇది పెను భారంగా మారుతుందని తెలిపారు. ఫీజు చెల్లించి ఉద్యోగులను రప్పించుకోవడం అనేది ఖర్చుతో కూడుకున్నదని వ్యాఖ్యానించారు.
ఇప్పుడు ఏకంగా 20 రాష్ట్రాలు న్యాయస్థానాలను ఆశ్రయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆసుపత్రులు, యూనివర్శిటీలు, ప్రభుత్వ పాఠశాలలు, పరిశోధనా సంస్థలపై H-1B వీసా ఫీజు పెంపు ప్రభావం తీవ్రంగా పడిందని చెబుతున్నాయి. H-1B వీసా దరఖాస్తు ప్రక్రియలోని సాంప్రదాయ ఫీజులు గతంలో పరిపాలనా ఖర్చులను పూరించడానికే పరిమితమై ఉండేవని ఆయా రాష్ట్రాలు గుర్తుచేశాయి. ఈ కొత్త విధానం అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ యాక్ట్, అమెరికా రాజ్యాంగాలను ఉల్లంఘిస్తోందని, తప్పనిసరి నిబంధనల ప్రక్రియలను దాటవేస్తోందని, కాంగ్రెస్ ఇచ్చిన అధికారాలను మించిపోతోందని వాదిస్తున్నాయి.
ఆయా రాష్ట్రాల తరఫున కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా, ఆండ్రియా తమ వాదనలను వినిపిస్తోన్నారు. ఈ ఫీజు వ్యవహారం చట్టవిరుద్ధమైన, అనవసరమైన భారాలను సృష్టించిదని స్పష్టం చేశారు. 2024- 25 విద్యా సంవత్సరంలో అమెరికా పాఠశాల జిల్లాల్లో సైన్సెస్, ఈఎస్ఎల్, విదేశీ భాషల విభాగాలలో ఖాళీలను భర్తీ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటోన్నాయని అన్నారు.
-
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications