'వయాగ్రా'..: 20ఏళ్లుగా అలాంటి మరో మిరాకిల్ డ్రగ్ కోసం ప్రయత్నాలు
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా 'వయాగ్రా'కి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లైంగిక సామర్థ్యం విషయంలో ఆత్మన్యూనతలో కూరుకుపోయిన ఎంతోమందికి వయాగ్రా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. వయాగ్రా అందుబాటులోకి వచ్చిన 20ఏళ్లలో.. అంతే స్థాయి శక్తివంతమైన పిల్ కోసం పిఫైజర్(బయోఫార్మాసూటికల్ కంపెనీ) ప్రయోగాలు చేస్తూనే ఉంది.
వయాగ్రా స్థాయిలో మళ్లీ అంతటి లాభాలు తెచ్చిపెట్టే పిల్ కోసం ఆ కంపెనీ సాగిస్తున్న ప్రయత్నాలకు ఇప్పుడు బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది. ఔషధ ప్రయోగాల ఏటా భారీ స్థాయిలో ఖర్చు చేయాల్సి వస్తుండటంతో.. కాస్ట్ కట్టింగ్ చర్యల్లో భాగంగా ఆ ప్రయత్నాలకు అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది.

ఈ ఏడాది రీసెర్చ్&డెవలప్‌మెంట్ కోసం పిఫైజర్ 7.4-7.9 యూఎస్ బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది. గతేడాది ఖర్చు పెట్టిన 7.7 యూఎస్ బిలియన్ డాలర్లతో పోల్చితే ఇది ఎక్కువే. అదే సమయంలో పిఫైజర్ ప్రత్యర్థి అయిన జాన్సన్&జాన్సన్ కంపెనీ దాదాపుగా 10యూఎస్ బిలియన్ డాలర్లను ఈ ఏడాది ఔషధ ప్రయోగాలకు ఖర్చు చేసింది.
అల్జీమర్, పార్కిన్సన్ వ్యాధులకు సంబంధించిన ఔషధ ప్రయోగాలను ఇక నిలిపివేసి.. ఆ బడ్జెట్‌ను వేరే వాటి కోసం ఉపయోగించాలని భావిస్తోంది. అలాగే హెల్త్ కేర్ బిజినెస్‌ను సైతం విక్రయించడానికి సిద్దడింది. ఇందులో భాగంగా మల్టీ విటమిన్ సెంట్రమ్, చాప్‌స్టిక్ లిప్‌బామ్, యాంటీ ఇన్‌ఫ్లేమటరీ డ్రగ్ అడ్‌విల్ వంటి పాపులర్ ఔషధ ఉత్పత్తులను కూడా విక్రయించనున్నారు.
కొత్త పిల్ కోసం జరుగుతున్న ప్రయోగాలకు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుండటం.. ఒకవేళ దాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చినా తక్కువ ధరకే అందుబాటులో ఉంచాల్సి రావడం.. పిఫైజర్‌కు రిస్కుగా మారింది. అయితే వీటన్నింటిని అధిగమించి ఔషధ రంగంలో వయాగ్రా లాంటి మరో విప్లవాత్మకమైన పిల్‌ను గనుక పిఫైజర్ అందుబాటులోకి తీసుకొస్తే.. కంపెనీ ఆర్థిక ఎదుగుదలకు అది చాలావరకు దోహదపడనుంది.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications