పాక్‌వి కోతలే: దోమ కాటుతో ‘అణు’ బండారం బట్టబయలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌కు అణ్వాయుధాలు తయారు చేసుకునే సామర్థ్యం లేదని తేలిపోయింది. పాకిస్థాన్ అణ్వాయుధాల తయారీ వెనుక చైనా హస్తం ఉందన్న అనుమానాలను కొన్ని దోమలు పటాపంచలు చేశాయి. అసలు ఆ దోమలు ఏం చేశాయంటే పాకిస్థాన్‌లో ఉన్న చైనా ఇంజినీర్లను కుట్టాయి. దీంతో వారంతా ఆస్పత్రి పాలయ్యారు.

పాక్‌కు చైనా సహకారం
ఒక్కరూ కాదు ఇద్దరు కాదు ఏకంగా 200మందికిపైగా చైనీయులు డెంగ్యూ జ్వరంతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అసలు ఇంతమంది చైనా ఇంజినీర్లకు పాకిస్థాన్‌లో ఏం పని అంటే.. వారంతా ఇక్కడ అణ్వాయుధాలను తయారు చేయడంలో పాకిస్థాన్‌కు సహకరిస్తుండటం గమనార్హం.

ప్రత్యేకంగా వైద్య చికిత్సలు
పాకిస్థాన్ కరాచీలోని హాకీస్ బేస్‌లో ఉన్న అణుశక్తి కేంద్రంలో వివిధ హోదాల్లో ఈ చైనా ఇంజినీర్లంతా పనిచేస్తున్నారు. ఈ చైనీయులందరికీ పాకిస్థాన్ ప్రభుత్వం ప్రత్యేక వైద్య చికిత్సలు అందిస్తోంది. ఏకంగా పాకిస్థాన్ ఆరోగ్యమంత్రి ఆజ్రా ఫైజల్ వీరి బాగోగులను చూసుకుండుటం గమనార్హం.

వందలాదిమంది చైనా ఇంజినీర్లు..
ప్రస్తుతం 200మంది చైనా ఇంజినీర్లు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. మిగితా వారంతా అణుశక్తి కేంద్రంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దోమల కాటు కారణంగానే చైనీయులు ఈ అణు కేంద్రంలో పనిచేస్తున్నట్లు తెలిసింది.

పాక్‌వి కోతలే..
పెద్ద సంఖ్యలోనే చైనాకు చెందిన ఇంజినీర్లు ఇక్కడ పనిచేస్తున్నట్లు స్పష్టమైంది. ఈ వ్యవహారంతో తాము అణ్వాయుధాలను తయారు చేసుకుంటున్నామన్న పాక్ మాటలు కోతలనే విషయం తేలిపోయింది.
-
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
పాకిస్తాన్‌కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications