200 ఏళ్ల నాటి కండోమ్.. ఈ సీక్రెట్స్ తెలిస్తే షాక్..? ఎగబడుతున్న జనం
200 ఏళ్లకు పూర్వం నుంచే కండోమ్స్ వాడుకలో ఉన్నాయని మీకు తెలుసా..? తాజాగా నెదర్లాండ్స్ లో దాదాపు 200 ఏళ్ల నాటి కండోమ్ ప్రత్యక్షమైంది. 1830ల్లో తయారు చేసిన ఈ కండోమ్ ను అక్కడ ఓ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు. అయితే చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఈ కండోమ్ ను చూసేందుకు ఎగబడుతున్నారు. అంతగా ఈ కండోమ్ లో ఏం స్పెషల్ ఉంది..?
నెదర్లాండ్స్ ఆమ్ స్టర్ డ్యామ్ లోని ఓ మ్యూజియంలో దాదాపు 200 ఏళ్లనాటి కండోమ్ ను వేలానికి ఉంచారు. ఈ కండోమ్ 1830ల్లో తయారు చేశారట. ఈ కండోమ్ పై ఉన్న చిత్రం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ముగ్గురు అర్ధనగ్నంగా నిలబడి ఉన్నారు. ఈ కండోమ్ పై చిత్రం గ్రీకు పురాణం నుండి ప్రేరణ పొంది ఉంటారని నిపుణులు అంటున్నారు. ఇది 20 మీటర్ల పొడవు ఉంది. ఈ కండోమ్ దాదాపు 200 ఏళ్ల నాటిదని.. ఈ అరుదైన కండోమ్ ను 1830 లో తయారు చేశారని భావిస్తున్నారు.

ఈ కండోమ్ ను గొర్రె పోగుతో తయారు చేశారు. అయితే దీన్ని ఇంత వరకూ ఎవరూ వాడలేదని నిపుణులు చెబుతున్నారు. ఈ కండోమ్ ను లైంగిక సుఖం కోసం, అవాంఛిత గర్భం రాకుండా ఉండేందుకు తయారు చేశారని నిపుణులు చెబుతున్నారు. అప్పట్లో కొన్ని నగరాల్లో వ్యభిచారం జోరుగా సాగేదని.. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కండోమ్ ను కస్టమర్లు వినియోగించేవారని అభిప్రాయపడ్డారు. ఈ కళాఖండాన్ని ప్రదర్శనలో ఉంచినప్పటి నుంచి చిన్నా పెద్ద తేడాలేకుండా మ్యూజియానికి క్యూ కడుతున్నారని అధికారులు తెలిపారు. 2025 నవంబర్ చివరి వారం వరకు ఈ కండోమ్ ప్రదర్శనలో ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications