బాప్‌రే: బయటపడ్డ 2వేల ఏళ్ల క్రితంనాటి అతిపెద్ద శవపేటిక..ఏముందో తెలుసా..?
Recommended Video

ఈజిప్టు దేశం అలెగ్జాండ్రియా నగరంలో ఓ చోట కొత్త భవనం నిర్మించేందుకు భూమిని తవ్విన పురావస్తు శాఖ అధికారులకు మైండ్ బ్లాక్ అయ్యింది. భవన నిర్మాణం కోసం లోతుగా భూమిని తవ్విన వారికి గ్రనైట్ రాయితో చేయబడ్డ ఓ పెద్ద శవపేటిక కనిపించింది. ఇది దాదాపు 2వేల ఏళ్ల నాటిదై ఉండొచ్చని పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు.

8.69 అడుగుల పొడవు 6 అడుగుల వెడల్పు 5.41 అడుగుల ఎత్తుతో ఉన్న ఈ గ్రానైట్ శవపేటిక ఇప్పటి వరకు అత్యంత పెద్ద శవపేటికని అధికారులు తెలిపారు. 2000 ఏళ్లుగా భూమిలో ఉన్నప్పటి నుంచి దీన్ని ఒక్కసారి కూడా తెరచి చూడలేదని అయితే ఆ నల్లటి శవపేటికలో ఏముందో ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నట్లు అధికారులు చెప్పారు.

ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త టోలెమాక్ జీవించిన యుగానికి సంబంధించిన శవపేటికై ఉంటుందన్న అనుమానం వ్యక్తం చేశారు పురావస్తు శాఖ అధికారులు. శవపేటిక పక్కనే మరో పాలరాతి ప్రతిమ అధికారులకు కనిపించింది. ఒక మనిషి ఈ శవపేటికలో ఉండి ఉండొచ్చనేదానికి సంకేతంగా ఈ పాలరాతి ప్రతిమను పక్కన పెట్టి ఉండొచ్చనే అనుమానం అధికారులు వ్యక్తం చేశారు. అయితే ఆ మనిషి ఎవరన్నది మాత్రం వారు స్పష్టం చేయలేదు.












Click it and Unblock the Notifications