వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2020 కంటే దరిద్రంగా 2021 -నోబెల్ విజేత WFP చీఫ్ హెచ్చరిక -దివాళా దిశగా 50 దేశాలు..

|
Google Oneindia TeluguNews

స్పానిష్ ఫ్లూ తర్వాత వందేళ్లకు ప్రపంచం మొత్తాన్ని నిలువునా వణికించింది కరోనా వైరస్. అప్పటితో పోల్చుకుంటే.. ప్రస్తుత ఆర్థిక, సామాజిక రంగాలపై కొవిడ్-19 ప్రభావం వెయ్యిరెట్లు పెద్దది. గతేడాది చివర్లో చైనాలోని వూహాన్ లో పుట్టిన కరోనా.. 2020 జనవరి చివరినాటికే ప్రపంచమంతటా విస్తరించింది. మార్చి చివరి కల్లా భారత్ సహా వందలాది దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లాయి. ఒక్క చైనా తప్ప అన్ని దేశాల జీడీపీ మైనస్ లోకి జారుకుంది. కోట్లాది మంది ఉద్యోగాలు ఆవిరైపోగా, లక్షల మంది దరిద్రంలోకి కూరుకుపోయారు. 2020ని తిట్టుకోని మనిషంటూ ఎవరూ ఉండరు. సరే, అన్‌లాక్ తోనైనా పరిస్థితి మారుతుందని ఆశించినా..

సీఎంగా బీజేపీ అభ్యర్ధి బాగుండేది -నితీశ్ కుమార్ సంచలనం -ఇంజనీర్ నుంచి సుశాసన్‌బాబుగా..సీఎంగా బీజేపీ అభ్యర్ధి బాగుండేది -నితీశ్ కుమార్ సంచలనం -ఇంజనీర్ నుంచి సుశాసన్‌బాబుగా..

తీవ్ర హెచ్చరికలు..

తీవ్ర హెచ్చరికలు..

2020 ఏడాది కంటే రాబోయే 2021 ఏడాది మరిత దరిద్రంగ, భయానకంగా ఉండబోతున్నదని ప్రపంచ ఆహార కార్యక్రమం(వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్-WFP) బాంబు పేల్చింది. ఐక్యరాజ్యసమితికి అనుబంధగా పనిచేసే డబ్ల్యూఎఫ్‌పీకి ఈఏడాది నోబెల్ శాంతి పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. డబ్ల్యూఎఫ్‌పీ సారధి డేవిడ్ బేస్లీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ రాబోయే రోజులపై కీలక హెచ్చరికలు చేశారు.

 ఉన్నదంతా ఊడ్చేశారు..

ఉన్నదంతా ఊడ్చేశారు..

2020లో మొదలైన కోవిడ్-19 విపత్తు 2021 ఏడాదిని మరింతగా కబలించబోతున్నదని, ఆర్థిక వ్యవస్థలను వైరస్ మరింతగా ప్రభావితం చేయబోతున్నది డేవిడ్ పేర్కొన్నారు. ‘‘కరోనా పరిస్థితుల వల్ల ఆకలి అనే మహమ్మారి కూడా పీక్స్ కు చేరబోతున్నది. ప్రపంచ నేతలు తమ దేశాల్లో ఉద్దీపన ప్యాకేజీలు, పేదలకు ఆర్థిక సహాయం ప్రకటనల ద్వారా ఉన్న నిధులతో 2020ను ఎలాగోలా మేనేజ్ చేశారు కానీ, వచ్చే ఏడాది పరిస్థితులు మరింతగా దిగజారబోతున్నాయి. 2021ని ఎలా ఎదుర్కోవాలని నేతలు తలలు పట్టుకుంటున్నారు'' అని డబ్ల్యూఎఫ్‌పీ అన్నారు.

 దివాళా దిశగా 50 దేశాలు..

దివాళా దిశగా 50 దేశాలు..

నిరంతరంగా ప్రయాణించే ప్రపంచం అనే నౌక.. 2021లో ఆకలి, కరువు, వలసలు అనే ఐస్‌బర్గ్(మంచుకొండల్ని) ఢీకొనబోతున్నదని, కొత్తగా 50కిపైగా దేశాలు కరువు, దివాళా దశకు చేరే ప్రమాదం ఉందని డేవిడ్ బేస్లీ అన్నారు. 2021 జనవరి నాటికి కొవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా, ప్రజలందరికీ దానిని అందజేయడానికి కనీసం మూడేళ్లయినా పడుతుందన్న అంచనాల నేపథ్యంలో గడ్డు పరిస్థితులు తప్పబోవన్నారు. పశ్చిమదేశాల ఎకానమి కొంతలో కొంత కోలుకోవడం తప్ప పాజిటివ్ సంకేతాలేవీ ప్రస్తుతానికి లేవని, ప్రపంచమంతా ఆశావాద దృక్ఫథంతో ముందుకు నడవటం అత్యవసరమని డబ్ల్యూఎఫ్‌పీ సారధి పేర్కొన్నారు. ఆదివారం నాటికి గ్లోబల్ గా కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య 5.5కోట్లకు చేరింది. మరణాల సంఖ్య 13.2లక్షలకు పెరిగింది. అమెరికా, యూరప్ ఖండంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా పలు దేశాల్లో మళ్లీ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.

ఒకే దెబ్బకు రెండు పిట్టలు -పవన్ కల్యాణ్ వ్యూహరచన -17,18 తేదీల్లో జనసేన క్రియాశీలక సమావేశాలుఒకే దెబ్బకు రెండు పిట్టలు -పవన్ కల్యాణ్ వ్యూహరచన -17,18 తేదీల్లో జనసేన క్రియాశీలక సమావేశాలు

English summary
'Next year is going to be worse than 2020', warned the head of the World Food Program (WFP), which was awarded Nobel Peace Prize 2020. In an interview with The Associated Press, David Beasley, the head of the WFP asserted that the Nobel Peace Prize has given the UN agency a spotlight and megaphone to warn world leaders about 2021. He claimed that without billions of dollars "we are going to have famines of biblical proportions in 2021.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X