షాక్: అమ్మాయి పొట్టి దుస్తులేసుకుందని చెంప ఛెళ్లుమనిపించాడు(వీడియో)
రంజాన్ సాగుతున్న వేళ పొట్టి దుస్తులు వేసుకుని బస్సు ఎక్కిందని ఆరోపిస్తూ.. ఓ అమ్మాయి చెంప ఛెళ్లుమనించాడో యువకుడు. ఆమె ప్రతిఘటించేందుకు ప్రయత్నిస్తే మరోసారి దాడి చేసి, వెంటనే బస్సు దిగిపారిపోయాడు.
ఇస్టాంబుల్: రంజాన్ సాగుతున్న వేళ పొట్టి దుస్తులు వేసుకుని బస్సు ఎక్కిందని ఆరోపిస్తూ.. ఓ అమ్మాయి చెంప ఛెళ్లుమనించాడో యువకుడు. ఆమె ప్రతిఘటించేందుకు ప్రయత్నిస్తే మరోసారి దాడి చేసి, వెంటనే బస్సు దిగిపారిపోయాడు. ఇదంతా బస్సులోని కెమెరాలో రికార్డైంది. ఈ ఘటన టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. బుధవారం అసీనా మెలిసా సగ్లామ్(21) అనే యువతి బస్సులో షార్ట్ ధరించి ఓ సీటులో కూర్చుని ఉంది. ఆమె వెనకే ఉన్న ఓ యువకుడు.. బస్సు దిగేందుకు వెళుతూ ఆమె చెంపపై చాచి కొట్టాడు. దీంతో ఆమె వెంటనే అతడ్ని ప్రతిఘటించేందుకు ప్రయత్నించింది.
అయితే, అతడు మరోసారి ఆమెపై దాడి చేసి.. వెంటనే బస్సులోంచి దూకేసి పరారయ్యాడు. దీంతో ఒక్కసారిగా బస్సులో ఉన్న మిగితా ప్రయాణికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఏడుస్తూ బస్సులోనే కిందపడిపోయిన బాధితురాలికి సాయం అందించారు.
కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బస్సు కెమెరా ఫుటేజీని పరిశీలించి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన బస్సు సీసీ కెమెరా ఫుటేజీ వైరల్ అవడంతో నిందితుడిపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications