7వ వింబుల్డన్ టైటిల్ గెలుచుకున్న నొవాక్ జకోవిచ్: ఖాతాలో 21వ గ్రాండ్‌స్లామ్

న్యూఢిల్లీ: సెర్బియా టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ మరోసారి సత్తా చాటాడు. జకోవిచ్
4-6 6-3 6-4 7-6(3)తో నిక్ కిర్గియోస్‌ను ఓడించి ఆదివారం ఏడో వింబుల్డన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. సెర్బ్ ఇప్పుడు వరుసగా నాలుగు వింబుల్డన్ టైటిళ్లను గెలుచుకున్నాడు. అంతేగాక, 21 గ్రాండ్ స్లామ్ సాధించి రాఫెల్ నాదల్ కంటే ఒకటి తక్కువలో ఉన్నాడు.

కిర్గియోస్ కొన్ని అద్భుతమైన సర్వ్‌లతో ప్రారంభ సెట్‌ను గెలుచుకున్నాడు, అయితే జకోవిచ్ రెండు, మూడవ సెట్‌లను సులభంగా గెలుచుకోవడంతో అతను తన జోరును కొనసాగించడంలో విఫలమయ్యాడు. కిర్గియోస్ చివరి సెట్‌లో జకోవిచ్‌కి గట్టిపోటీని అందించాడు, కానీ టాప్ సీడ్ సెర్బ్‌ను చరిత్ర సృష్టించకుండా ఆపడానికి అతని శక్తి సరిపోలేదు.

 21st Grand Slam: Novak Djokovic Beats Nick Kyrgios To Win 7th Wimbledon Title

జకోవిచ్ సెమీ-ఫైనల్స్‌లో కామెరాన్ నోరీని ఓడించి తన 32వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరుకున్నాడు. దీంతో, వెటరన్ రోజర్ ఫెదరర్‌ను అధిగమించి ఓపెన్ ఎరాలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌కు చేరిన ఘనత సాధించాడు.

జొకోవిచ్ టోర్నమెంట్ మొదటి రౌండ్‌లో క్వాన్ సూన్-వూ, రెండవ రౌండ్‌లో థానాసి కొకినాకిస్, మూడో రౌండ్‌లో మియోమిర్ కెమనోవిచ్, నాల్గవ రౌండ్‌లో టిమ్ వాన్ రిజ్‌థోవెన్, క్వార్టర్ ఫైనల్‌లో జానిక్ సిన్నర్‌లను ఓడించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+