14 ఏళ్ల బాలుడితో గర్భం దాల్చిన మహిళ... ఏడాదిగా సంబంధం... లైంగిక దాడి కేసు నమోదు...

అమెరికాలో దారుణం వెలుగుచూసింది. 23 ఏళ్ల ఓ మహిళ 14 ఏళ్ల బాలుడితో ఏడాది కాలంగా లైంగిక సంబంధం కొనసాగిస్తోంది. ఇటీవల ఆమె గర్భం కూడా దాల్చింది. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో ఆమెపై చర్యలు తప్పలేదు. మైనర్ బాలుడిపై లైంగిక దాడికి గురైందన్న ఆరోపణలతో ఆమెపై కేసు నమోదైంది.

వివరాల్లోకి వెళ్తే... అమెరికాలోని అర్కాన్సాస్‌కి చెందిన బ్రిట్నీ గ్రే(23) 14 ఏళ్ల బాలుడితో లైంగిక సంబంధం పెట్టుకుంది. ఈ ఇద్దరూ తరుచూ ఆమె ఇంట్లో కలుస్తూ లైంగిక కార్యకలాపాలు సాగిస్తున్నారు. గతేడాది ఫిబ్రవరి 28న ఓ వ్యక్తి చైల్డ్ అబ్యూజ్ హాట్‌లైన్‌కి ఫోన్ చేసి అధికారులకు దీనిపై సమాచారం అందించాడు.

23 years old pregnant with 14 years old boy US Woman Charged With Sexual assault

గతేడాది సెప్టెంబర్‌లో మరో వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి ఇదే విషయాన్ని చెప్పాడు. గ్రే అనే మహిళ ఓ మైనర్ బాలుడితో లైంగిక సంబంధం కొనసాగిస్తోందని చెప్పాడు. దీంతో ఆ వ్యక్తిని విచారించిన పోలీసులు మరిన్ని వివరాలు రాబట్టారు. అతను చెప్పింది నిజమేనని నిర్దారించుకున్న తర్వాత నేరుగా రంగంలోకి దిగారు.

ఈ క్రమంలో గ్రే,ఆ బాలుడు కలిసి ఓ ఆస్పత్రికి వెళ్లిన సీసీటీవీ ఫుటేజీని సేకరించారు. అక్కడి వైద్యులు తెలిపిన వివరాల మేరకు ప్రస్తుతం ఆమె గర్భవతి అని,బాలుడితో సంబంధం కారణంగానే గర్భం దాల్చిందని తెలుసుకున్నారు. దీంతో మార్చి 1న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. మైనర్ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిందన్న అభియోగాల కింద ఆమెపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

గతంలోనూ అమెరికాలో ఇలాంటి కేసులు వెలుగుచూశాయి. కొన్నేళ్ల క్రితం మెలిసా ఆండ్రేనీ అనే ఒక టీచర్ 15 ఏళ్ల టీనేజ్ విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకున్న ఘటన వెలుగుచూసింది. ఈ కేసులో అరెస్టయిన ఆమె ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+