బస్సులోకి దూసుకెళ్లిన కారు: 24మంది మృతి
మెక్సికో సిటీ: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ కారు అదుపుతప్పి బస్సును ఢీకొన్న ప్రమాదంలో 24 మంది మృతి చెందారు. ప్యూబ్లా ప్రాంతంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో మంటలు వ్యాపించడంతో బస్సులోని 32 మంది ప్రయాణికుల్లో 22 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు కారులో మృతిచెందారు. కారు.. బస్సు డోరు మధ్యలో ఇరుక్కోవడంతో ప్రయాణికులకు బస్సులోంచి బయటకు వచ్చేందుకు వీల్లేకుండా లేకపోయిందని అధికారులు చెప్పారు.

ఇంతలో మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు మృత్యువాతపడ్డారని అధికారులు తెలిపారు. బస్సులోని మరో10 మంది ప్రయాణికులు బస్సు అద్దాలు పగలగొట్టి బయటికి దూకడంతో గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అమెరికాలో కాల్పుల కలకలం
వాషింగ్టన్: అమెరికాలోని న్యూ ఆర్లియన్స్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. న్యూఆర్లియన్స్‌లో జరిగిన ఈ కాల్పుల్లో 10మందికి గాయాలయ్యాయి. అక్కడకు చేరుకున్న అధికారులు క్షతగాత్రులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications