కోర్టుకెక్కిన 25 రాష్ట్రాలు. ట్రంప్‌నకు దిమ్మతిరిగే షాక్! భారత్‌కు ఊరట..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు సొంత దేశంలోనే తీవ్ర నిరసనలకు దారితీస్తున్నాయి. "వెట్టిచాకిరీ/బలవంతపు శ్రమ" నిరోధక నిబంధనల పేరుతో యూరోపియన్ యూనియన్ సహా దాదాపు 60కి పైగా దేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై కొత్తగా సుంకాలు విధిస్తూ ట్రంప్ యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం చట్టవిరుద్ధమని, అధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని ఆరోపిస్తూ ఏకంగా 25 అమెరికన్ రాష్ట్రాలు కలిసి అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వంపై కోర్టులో యుద్ధం ప్రకటించాయి.

కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రోబ్ బొంటా నాయకత్వంలో ఆరిజోనా, ఒరెగాన్, న్యూయార్క్, వాషింగ్టన్ సహా 25 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టులో ఈ దావా వేశారు. అమెరికాలోకి వచ్చే మొత్తం దిగుమతుల్లో 99.4 శాతం భాగస్వామ్యం ఉన్న 80కి పైగా దేశాలపై ఈ భారం పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అధ్యక్షుడిగా ట్రంప్ చట్టాలను ఉల్లంఘిస్తూ, అమెరికా ప్రజలపై నిత్యావసరాల భారాన్ని పెంచేందుకు పదే పదే ప్రయత్నిస్తున్నారని, గతంలో కోర్టులు కొట్టివేసిన పన్నుల విధానాన్నే మళ్లీ కొత్త పేరుతో తీసుకొచ్చారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

25 US States Sue Trump Administration Over New Forced Labour Tariffs Imposed on EU and 60 Nations
వరల్డ్ వార్ 2 ను మించిన దాడులు జరిగేవి: రెండే కండీషన్లు- డొనాల్డ్ ట్రంప్
వరల్డ్ వార్ 2 ను మించిన దాడులు జరిగేవి: రెండే కండీషన్లు- డొనాల్డ్ ట్రంప్

రూల్స్ అతిక్రమించి కంటితుడుపు విచారణ?

సాధారణంగా 1974 వాణిజ్య చట్టం సెక్షన్ 301 ప్రకారం ఏదైనా దేశంపై సుంకాలు విధించాలంటే కనీసం ఏడాది పాటు సమగ్ర విచారణ జరపాల్సి ఉంటుంది. కానీ యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ కార్యాలయం కేవలం రెండున్నర నెలల్లోనే 60 దేశాలపై ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేకుండా అత్యంత వేగంగా విచారణ పేరిట నివేదిక మమ అనిపించిందని రాష్ట్రాలు కోర్టు దృష్టికి తీసుకెళ్లాయి. గతంలో కూడా ఎమర్జెన్సీ అధికారాల పేరుతో ట్రంప్ తెచ్చిన పన్నులను కోర్టులు కొట్టివేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ట్రంప్ చనిపోతే ఉచిత బీర్.. చివరికి సీన్ రివర్స్!
ట్రంప్ చనిపోతే ఉచిత బీర్.. చివరికి సీన్ రివర్స్!

భారత్‌కు ఊరట.. ఇతర దేశాలపై 12.5 శాతం భారం!

మరోవైపు ఈ నూతన టారిఫ్ విధానంలో భారత్‌కు కాస్త ఊరట లభించింది. విదేశీ వాణిజ్య చర్చల ఫలితంగా భారత్‌ను తక్కువ పన్ను పరిధి అయిన 10 శాతం కేటగిరీలో చేర్చారు. మన దేశంతో పాటు బ్రిటన్, కెనడా, మెక్సికో, ఇండోనేషియా వంటి దేశాలు కూడా ఈ 10 శాతం పన్నుల పరిధిలోకి వచ్చాయి. అయితే యూరోపియన్ యూనియన్, తైవాన్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల ఉత్పత్తులపై 10 నుంచి 12.5 శాతం వరకు అధిక పన్నుల భారం పడింది. అమెరికా పౌరుల జీవన వ్యయాన్ని పెంచేలా ఉన్న ఈ సుంకాలను వెంటనే రద్దు చేయాలని 25 రాష్ట్రాలు దాఖలు చేసిన దావాతో ట్రంప్ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+