భారీ పేలుడు: 29 మంది మృతి, 70మందికి గాయాలు
మెక్సికోలో జరిగిన భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో 26 మంది మృతిచెందగా.. మరో 70 మందికి పైగా గాయపడ్డారు.
మెక్సికో: మెక్సికోలో జరిగిన భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో 29 మంది మృతిచెందగా.. మరో 70 మందికి పైగా గాయపడ్డారు. రాజధాని నగరమైన మెక్సికో సిటీలోని బాణాసంచా మార్కెట్‌లో మంగళవారం రాత్రి ఈ పేలుడు సంభవించింది.
క్షతగాత్రులను సమీపంలోని పలు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో బాణాసంచా కొనుగోలు చేసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో మార్కెట్ కిటకిటలాడుతోంది. ఆ సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించి బాణాసంచా దుకాణాలు దగ్ధమయ్యాయి.

పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్లు, వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో మార్కెట్ మొత్తం దగ్ధమైంది. మూడు గంటలపాటు శ్రమించిన తర్వాత మంటలు అదుపులోకి వచ్చినట్లు ఫైర్ సిబ్బంది వెల్లడించారు.
కాగా, ఈ పేలుడు ఘటనపై మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నియోటో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications