Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పోకిరీ: అతనికి 10 మంది భార్యలు, 15 మంది పిల్లలు

లండన్: ఉద్యోగం సద్యోగం లేదు, మహిళలను లోబరుచుకోవడం పిల్లలను కనడమే పనిగా పెట్టుకున్నట్లున్నాడు ఓ పోకిరీ. 29 ఏళ్ల వయస్సులోనే అతను 10 మంది మహిళలతో కాపురం చేసి, 15 మంది పిల్లలను కన్నాడు. త్వరలోనే 16వ బిడ్డకు తండ్రి కాబోతున్నాడు ఇంగ్లాండ్‌కు చెందిన కీత్‌ మెక్‌ డొనాల్డ్‌ అనే యువకుడు.

దాన్ని ఓ ఘనకార్యంగా చాటుకుంటున్నాడు. ‘‘తొమ్మిది నెలల క్రితం నేను శృంగారంలో పాల్గొన్నాను. ఆమె ఇప్పుడు 16వ బిడ్డకు తల్లి కాబోతోంది. అమ్మాయిలను పడేయటం చాలా సులభం. అందుకోసం నేను సుందర్‌లాండ్స్‌ నుంచి బర్మింగ్‌హామ్‌కు బస్సులు, రైళ్లలో ప్రయాణిస్తా. ఫోన్‌ నెంబర్‌ తీసుకుని ఛాటింగ్‌ చేస్తా.. లైన్లో పెడతా.. వాళ్లు కూడా వద్దని చెప్పలేరు. నా పిల్లల తల్లుల్లో చాలా మందితో బస్‌ ఇలాగే పరిచయం ఏర్పడింది.'' అని ఓ డాక్యుమెంటరీ ఇంటర్వ్యూలో చెప్పాడతను.1

 29-year-old has had 'fifteen children' by ten different mothers

15 ఏళ్ల వయసులోనే మెక్‌ డొనాల్డ్‌ మొదటిసారి తండ్రయ్యాడు. 20 దాటే సరికి 6గురు పిల్లలు పుట్టారు. శృంగారంలో గర్భ నిరోధక పద్ధతులు పాటించటం అతగాడికి ఏ మాత్రం ఇష్టం ఉండదట. 2011లో తొమ్మిదో సంతానం విషయంలో గొడవ జరిగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నాటకాలాడాడు. ఆ తర్వాత ఆ భార్య చేతిలో తన్నులు తిన్నాడు.

2012 నవంబర్‌లో ఇలాగే భార్యతో గొడవ పడినందుకు సుందర్‌లాండ్స్‌ మేజిసే్ట్రట్‌ హెచ్చరికలు అందుకున్నాడు. బ్రిటన్‌ ప్రభుత్వం అశక్తులకు ఇచ్చే పెన్షన్‌ (ఇన్‌కెపాసిటీ బెనిఫిట్స్‌) రూపంలో మెక్‌ డొనాల్డ్‌కు వారానికి 69 పౌండ్లు (ఆరున్నర వేల రూపాయలు) వస్తాయి. అందరు పిల్లలకు కలిపి 500 రూపాయలు ఖర్చు పెడతానని ఈ 16 బిడ్డల తండ్రి చెప్పాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+