గ్యాంగ్ రేప్ లు చేసినా..! తల్లిదండ్రులే దగ్గరుండి మరీ..

Subscribe to Oneindia Telugu

అంకార : రేప్ చేయడం.. శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఆ తర్వాత పెళ్లి చేసేసుకోవడం, అదీ అమ్మాయి అంగీకారంతో పనిలేకుండా..! టర్కీలో నానాటికీ పెరిగిపోతున్న రేపిస్టులందరికీ ఇదో అలవాటుగా మారిపోయింది. పెళ్లితో శిక్ష నుంచి తప్పించుకునే వెసులుబాటు ఉండడంతో, రేప్ లకు పాల్పడిని నిందితులంతా పెళ్లికొడుకుల అవతారమెత్తుతున్నారు. ఇందులో మైనర్ల సంఖ్యనే ఎక్కువగా ఉండడం గమనార్హం.

ఈ జాడ్యం ఎక్కడిదాకా వెళ్లిందంటే.. ఓ ప్రేయసి తన ప్రియుడితో కావాలని రేప్ చేయించుకుంది. అలా చేస్తే ఆ తర్వాత తల్లిదండ్రులే దగ్గరుండి మరీ సదరు రేపిస్ట్ తో పెళ్లి చేస్తారు కాబట్టి ప్రేయసే ప్రియుడికి రేప్ ప్లాన్ చేయాలన్న సలహా ఇచ్చింది. ఆ తర్వాతే అనుకున్నట్టుగా రేప్, ఆ తర్వాత పెళ్లి జరిగిపోయాయి.

ఇకపోతే ప్రస్తుతం ఈ విపరీత పరిణామాలను అక్కడి సుప్రీం కోర్డు తీవ్రంగా తప్పుబడుతోంది. పెళ్లితో రేప్ కేసుల నుంచి తప్పించుకుంటున్న నిందితులకు చెక్ పెట్టే యోచనలో ఉంది న్యాయస్థానం. కాగా ఇప్పటివరకు దాదాపుగా 3వేల మంది రేపిస్ట్ లు, బాధిత అమ్మాయిలను పెళ్లి చేసుకుని శిక్షల నుంచి తప్పించుకున్నట్టుగా టర్కీష్ వెబ్ సైట్ 'మిల్లియెత్' నివ్వెరపోయే విషయాలను బయటపెట్టింది.

3,000 Women And Children In Turkey Forced To Marry Rapists And Abusers

ఇందులోనే ఓ కేసు గురించి ప్రస్తావిస్తూ.. ముగ్గురు అబ్బాయిలు కలిసి ఓ అమ్మాయిపై అత్యాచారం చేయగా, అందులో ఓ యువకుడు బాధిత అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో ముగ్గురు శిక్షల నుంచి తప్పించుకున్నారు. నిజానికి టర్కీష్ చట్టాల ప్రకారం రేప్ కేసులో నిందితులకు 16 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అయితే తెలివిమీరిన అక్కడి రేపిస్టులంతా పెళ్లితో రేప్ కేసుల నుంచి తప్పించుకుంటున్నారు. బాధిత యువతుల తల్లిదండ్రులు కూడా రేపిస్టులతో పెళ్లికే మొగ్గు చూపుతున్నారు.

దీనిపై తీవ్రంగా స్పందించిన సుప్రీం న్యాయస్థానం.. 'బలవంతంగా ఓ అమ్మాయిని శారీరకంగా అనుభవించడమే కాకుండా, సదరు రేపిస్టులతోనే పెళ్లిళ్లు జరిపించి అమ్మాయిల జీవితాన్ని మరింత నరకప్రాయంగా మార్చవద్దని, ఇకముందు ఇలాంటి పెళ్లిళ్లకు చట్టబద్దత కల్పించేది లేదని' తెగేసి చెప్పింది. రాబోయే రోజుల్లో రేపిస్టులకు ఎలాంటి క్షమాభిక్షలు ఉండబోవని, రేప్-పెళ్లిళ్లను ఇక ఉపేక్షించేది లేదని సుప్రీం అప్పీళ్ల విభాగం అధిపతి ముస్తఫా ప్రకటించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
At least 3,000 women and in some cases children in Turkey have been forced into marrying men who have raped or abused them, according to officially registered marriages cited by Mustafa Demirdağ, the head of the Supreme Court of Appeals department that oversees sexual crimes.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి