రన్ వే పైనుంచి రోడ్డు మీదికి దూసుకొచ్చిన విమానం, మూడు ముక్కలైన ప్లైట్, ముగ్గురి మృతి..
Recommended Video
టర్కీలో విమానం రన్ వే నుంచి రహదారిపైకి దూసుకెళ్లింది. ఇస్తాంబుల్ సబీహ విమానాశ్రయంలో ఘటన జరిగింది. పెగాసస్ విమానయాన సంస్థకు చెందిన ప్లైట్ ల్యాండ్ అయ్యే సమయంలో ప్రమాదం జరిగింది. రహదారిపైకి దూసుకెళ్లిన విమానం మూడు ముక్కలైంంది. విమానం కుదుపునకు గురవడంతో అందులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు చనిపోయారు. మరో 179 మంది గాయపడ్డారు.

ముగ్గురు మృతి
ప్రమాదంలో తీవ్రగాయలైన ముగ్గురు చనిపోయారని టర్కీ రవాణాశాఖ మంత్రి మెహ్మెత్ పేర్కొన్నారు. గాయాలైన వారి పరిస్థితి మెరుగ్గా ఉందని తెలిపారు. విమానం మూడు ముక్కలు అవడంతో.. అందుల్లోంచి ప్రయాణికులు వచ్చినట్టు తెలుస్తోంది. రన్ వేపై ప్రమాదం నేపథ్యంలో.. ఇతర విమానాల రాకను నిలిపివేసినట్టు మంత్రి తెలిపారు. ప్రయాణికులు, సిబ్బందితో కలిసి 183 మందితో విమానం బయల్దేరిందని పేర్కొన్నారు.

18 ఆస్పత్రుల్లో చికిత్స
177 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో కలిసి ఇజ్మిర్ నుంచి విమానం బయల్దేరిందని ఇస్తాంబుల్ గవర్నర్ అలి యెర్లికయ తెలిపారు. గాయపడ్డ క్షతగాత్రులకు 18 ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో వాతావరణ పరిస్థితులు బాగోలేదని, అందుకే అదుపుతప్పి పోయి ఉంటుందని తెలిపారు. రన్ వే నుంచి 60 మీటర్ల వరకు రోడ్డుపైకి రావడంతో ప్రమాదం జరిగిందన్నారు.

గాలి వీయడంతోనే..?
ఫుటేజీలో మాత్రం రన్ వే పైకి వస్తోన్న సమయంలో విమానం హై స్పీడ్‌లో ఉంది. రన్ వే నుంచి 40 మీటర్ల దూరం వరకు గల రోడ్డుపైకి దూసుకొచ్చింది. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో భారీగా గాలి వీచింది. అంతకుముందు రెండు విమానాల ల్యాండింగ్‌కు అనుమతించలేదు. కానీ పెగాసస్ విమానానికి పర్మిషన్ ఇవ్వడంతో ప్రమాదం జరిగిందనే అనుమనాలు కూడా తలెత్తుతున్నాయి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications