సౌదీలో భారతీయుల్ని కర్రతో బాదిన ఓనర్ (పిక్చర్స్)
తిరువనంతపురం: సౌదీ అరేబియాలో ముగ్గురు భారతీయుల పైన యజమాని విచక్షణారహితంగా కర్రతో దాడి చేస్తున్న వీడియో ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది. బాధితులు కేరళలోని హరిపాద్ పట్టణానికి చెందిన వారిగా గుర్తించారు.
యజమాని తమను వేధిస్తున్నాడని, కాపాడాలని వారు ఈ వీడియోను కుటుంబ సభ్యులకు పంపించారు. ఈ వీడియోలో సౌదీ అరేబియాకు చెందిన ఆ యజమాని ఓ పెద్ద కర్రను పట్టుకొని ముగ్గురు బాధితులను దారుణంగా కొడుతున్న వీడియో దృశ్యాలు ఉన్నాయి.

యెమెన్‌లో ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి బాధితులను సౌదీ అరేబియాకు తీసుకు వెళ్లారు. అక్కడ ఇటుక బట్టీల్లో పని చేయాలని వేధించారు. దీనిపై ముఖ్యమంత్రి ఊమన్ చాందీ స్పందించారు. సౌదీలోని భారత ఎంబసీ, కేరళ సంఘాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. బాధితులను తీసుకువస్తామన్నారు.

బాధితులను రెండు రోజుల్లో వెనక్కి తీసుకు వస్తామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో చాలామంది కేరళీయులు మధ్యవర్తుల వల్ల సౌదీ అరేబీయా వెళ్లి బాధలు పడుతున్నారు. సౌదీకీ వెళ్లిన వారు ఎన్ని ఇబ్బందులు పడుతన్నప్పటికీ.. పేదరికం కారణంగా వెనక్కి రాలేకపోతున్నారు.












Click it and Unblock the Notifications