ఎయిర్‌పోర్టులో 2విమానాలు ఢీ: ముగ్గురు మృతి(వీడియో)
అట్లాంటా: దక్షిణ జార్జియాలోని విమానాశ్రయంలో రెండు చిన్న విమానాలు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రెండు సింగిల్ ఇంజిన్ విమానాలు బుధవారం ఉదయం 11 గంటల సమయంలో జార్జియా ప్రాంతీయ కారోల్‌టన్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
పైలట్లు ఒకేసమయంలో విమానాలను దించడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ఒక విమానాన్ని దించుతున్న సమయంలో మరో విమానం కూడా అదే దిశలో వచ్చి ఢీకొన్నట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.
ఒక విమానంలో మహిళా ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్, ఆమె దగ్గర శిక్షణ పొందుతున్న ఓ విద్యార్థి ఉండగా మరో విమానంలో 79 ఏళ్ల విలియం లెవిస్ లిండ్సే ఉన్నారు. వీరు ముగ్గురు కూడా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications