విషాదం: 8నెలల గర్భిణి తల్లిని కాల్చిన మూడేళ్ల బాలుడు
హూస్టన్: తుపాకీతో ఆడుకుంటూ మూడేళ్ల బాలుడు పొరపాటున తల్లిదండ్రులను కాల్చిన ఘటన న్యూ మెక్సికోలోని అలబుక్విరిక్విలోని హోటల్ రూమ్‌లో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే... ఈ ఘటనలో బాలుడి తండ్రితో పాటు గర్భిణి అయిన తల్లికి తీవ్రగాయాలయ్యాయి.
బాలుడు ఆటాడుకుంటూ తన తల్లి పర్సులో నుంచి హ్యాండ్ గన్‌ను తీసుకుని కాల్చగా బుల్లెట్ మొదట తండ్రి శరీరం పక్కభాగంలో దూసుకెల్లి బయటకు వచ్చి తల్లిని తాకింది. దీంతో హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి బాలుడి తల్లి దండ్రులను తరలించారు.

తండ్రి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కాగా ఎనిమిది నెలల గర్భంతో ఉన్న తల్లి పరిస్ధితి ఇంకా విషమంగానే ఉంది. బాలుడికి 2 సంవత్సరాల వయసున్న చెల్లెలు కూడా అదే హోటల్ రూంలో ఉండటంతో వారిద్దరిని చిన్నపిల్లల సంరక్షణ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
తల్లిదండ్రులపై బాధ్యతా రాహిత్యం కింద కేసు నమోదు చేసే అవకాశం ఉందని అలబుక్విరిక్వి జిల్లా పోలీసు అధికారి తెలిపారు. గతంలో కూడా అమెరికాలో చిన్న పిల్లలు కాల్చుకున్న ఘటనలు చాలా జరిగాయి.
జనవరి 21న ఫ్లోరిడాలో 2 సంవత్సరాల బాలుడు కారులో ఉన్న తండ్రి పిస్టల్‌తో కాల్చుకొని చనిపోయాడు. జనవరి మొదటి వారంలో డెట్రాయిట్‌లో 4 సంవత్సరాల బాలిక తన తోటి కుటుంబ సభ్యుడుని గన్‌తో కాల్చిన విషయం తెలిసిందే.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications