ఆడుకుంటూ 3 ఏళ్ల బాలిక తల్లోకి గన్ కాల్చిన సోదరుడు

న్యూఢిల్లీ: ఇంట్లో గన్ ఉండటం ఎంత ప్రమాదకరమో ఈ వార్త చదివితే తెలుస్తుంది. అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో ఘోరం జరిగింది. ఇంట్లో ఉన్న డ్రస్సెర్‌లోని గన్‌తో 4 ఏళ్ల బాలుడు.. 3 ఏళ్ల వయసున్న తన చెల్లెలు తలపై కాల్చిన సంఘటన లోరెయిన్ జరిగింది. ప్రస్తుతం ఆ బాలిక పరిస్ధితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

సోమవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. క్లీవ్‌ల్యాండ్‌కు 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోరెయిన్ నగరంలో ఇద్దరు పిల్లలు కూడా బెడ్ రూమ్‌లో ఆడుకుంటున్నారు. ఆడుకుంటున్న సమయంలో బాలుడుకి బెడ్ రూమ్‌లోని డ్రస్సెర్‌లో 40 క్యాలిబర్ గన్ కనిపించింది.

3-year-old Ohio girl shot by 4-year-old brother

ఆట వస్తువు అనుకున్నాడో ఏమోగానీ ప్రక్కనే ఉన్న చెల్లెలు తలలోకి కాల్చాడు. శరీరం మొత్తం రక్తం ఒడుతుండగా బాలిక తండ్రి తన రెండు చేతులతో సమీపంలో ఉన్న ఆసుపత్రిలో చేర్పించాడు. ఆసుపత్రి వచ్చే సందర్భంలో తన తండ్రి వెంట ఉన్న ఆ బాలుడు ఏడుస్తూ పలుమార్లు క్షమాపణలు కోరాడు.

ఈ విషయాన్ని విచారణ చేస్తున్న పోలీస్ కెప్టెన్ రోజర్ వాట్కిన్స్ తెలిపాడు. ప్రస్తుతం ఆ బాలిక పరిస్ధితి విషమంగా ఉందని, దేశపు ప్రాసిక్యూటర్ కార్యాలయం నేరారోపణల కింద కేసు పైల్ చేయమంటే చేస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+