వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెక్సికో టు ఇండియా: 311 మంది భారతీయులు ఇంటికీ, అక్రమంగా ఉంటున్నారని...

|
Google Oneindia TeluguNews

అక్రమ వలసదారులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని మెక్సికో తేల్చిచెప్పింది. ఇప్పటికే అమెరికా కూడా వలసదారులను తమ దేశంలోకి రానీయకపోవడంతో.. అదే బాటలో మెక్సికో కూడా ఆచరిస్తోంది. తమ దేశంలో అక్రమంగా ఉంటోన్న 311 మంది భారతీయులను స్వదేశానికి పంపిస్తున్నట్టు పేర్కొన్నది. వారు శుక్రవారం న్యూఢిల్లీ చేరుకుంటారని మెక్సికో అధికారులు పేర్కొన్నారు.

అమెరికాలోకి మెక్సికోలు చొరబడటాన్ని ఆ దేశం సీరియస్ గా పరిగణించింది. వారిని అడ్డుకోవడంతో.. తమ దేశంలో ఉన్న అక్రమ వలసదారులపై మెక్సికో ఫోకస్ చేసింది. ఈ మేరకు ఇన్ స్టిట్యూట్ నేషనల్ డీ మైగ్రేషన్ (ఐఎన్ఎం) సంస్థ తమ దేశంలో 311 మంది భారతీయ మహిళలు, పురుషులు అక్రమంగా ఉంటున్నారని తెలిపారు. వారిని టొలుకా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో భారతదేశం పంపిస్తున్నట్టు పేర్కొన్నది. విమానం శుక్రవారం ఉదయం న్యూఢిల్లీ చేరుకుంటుందని తెలిపింది.

311 Indians deported by Mexico to arrive in Delhi on Friday

మెక్సికో ప్రకటనను భారత్ అధికారులు కూడా ధ్రువీకరించారు. మెక్సికోలో ఉండటానికి 311 మంది సరైన ధ్రువపత్రాలు జతపరచలేదని భారత అధికారులు పేర్కొన్నారు. వారి వివరాలు తమకు పంపించారని తెలిపారు. ఒక్సాగా, బాజా, కాలిఫోర్నియా, వెరక్రూజ్, చిపాస్, సోనోరా, మెక్సికో సిటీ, డ్యురాంగో, టాబాస్కో ప్రాంతాల నుంచి 311 మంది ఉన్నారని తెలిపారు. వీరు తప్పా మరేవరు లేరని క్లారిటీ ఇచ్చారు.

అమెరికాలో మెక్సికో వాసులు అక్రమంగా రావడాన్ని ట్రంప్ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అయితే మెక్సికో నుంచి భారతీయులు కొందరు కూడా అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు వచ్చాయి. దక్షిణ సరిహద్దు నుంచి ఏడాదిలో 10 లక్షల మంది చొరబడేందుకు ప్రయత్నించారని అక్కడి అధికారులు పేర్కొన్నారు.

English summary
Mexico has deported a group of 311 illegal migrants from India, the first such action taken by the country since it enhanced efforts to crack down on people using its territory to sneak into the US.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X