మరోసారి భారీ భూకంపం.. భారత్ చుట్టూ ప్రకంపనలు
సరిహద్దు దేశం నేపాల్ లో మరోసారి భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టార్ స్కేల్ పై 4.3 గా ఉన్నట్లు నేపాల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(NCS) తెలిపింది. శుక్రవారం అర్థరాత్రి 1 గంటా 33 నిమిషాల సమయంలో ఈ భూకంపం సంభవించినట్లు పేర్కొంది. 10 కిలోమీటర్ల లోతులో నేపాల్ లో ఈ భూకంపం సంభవించినట్లు తెలిపింది. భారత్ లోని సరిహద్దు ప్రాంతాలు కూడా భూ ప్రకంపనలకు గురైనట్లు సమాచారం.
అయితే భూకంపం ధాటికి ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని అక్కడి విపత్తు నిర్వాహణ యంత్రాంగం పేర్కొంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు తెలిపింది. నేపాల్ భౌగోళిక పరిస్థితుల కారణంగా తరచూ భూకంపాలకు లోనవుతోంది. ఇటీవల వారం వ్యవధిలోనే 4 సార్లు అక్కడ భూకంపం సంభవించింది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనలో ఉన్నారు.
నేపాల్ ప్రాంతం సబ్ డక్షన్ జోన్ లో ఉంది. అందుకే తరచూ అక్కడ భూప్రకంపనలు సంభవిస్తుంటాయని అక్కడి విపత్తు నిర్వహణ అధికారులు పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం కూడా నేపాల్ లోని పోఖారా ప్రాంతానికి సమీపంలోని కాస్కి జిల్లాలో ఈ భూకంపం వచ్చినట్లు నేపాల్ జాతీయ భూకంప కేంద్రం అధికారికంగా ప్రకటన చేసింది. భూకంపం తీవ్రత చాలా దూరంగా వరకు వ్యాపించిందని స్పష్టం చేసింది.

వారం రోజుల్లోనే నేపాల్ కేంద్రంగా ఇది నాలుగో భూకంపం కావడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. మే రెండో వారంలో తూర్పు నేపాల్ లోని సోలుఖుంబు ప్రాంతంలో భూకంపం వచ్చింది. ఆ తర్వాతి రోజు కూడా అదే ప్రదేశంలో రెండోసారి భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు భయబ్రాంతులకు లోను కావొద్దని అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేశారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications